న్యూయార్క్ : కంటెంట్ ఉంటే చాలు... యూట్యూబ్‌లో దుమ్ము రేపొచ్చు. గూగుల్ చెప్పిన గుడ్ న్యూస్ వింటే ఆనందంతో గంతులేయడం ఖాయం. యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.
ఇకమీదట టిక్‌టాక్, రీల్స్‌కు మాదిరిగా యూట్యూబ్‌లో సైతం షార్ట్ టైమ్ డ్యురేషన్ ఉన్న వీడియోలను చేసి దుమ్మురేపొచ్చు. భారత్‌లో షార్ట్స్ టైమ్ డ్యూరేషన్‌పై యూట్యూబ్ కీలక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలో ఫుల్ జోష్ నింపింది.
టిక్‌టాక్ బ్యాన్ అయిన విషయాన్ని పక్కనబెట్టి, యూట్యూబ్‌లో వీడియోస్ అదరగొట్టేయవచ్చు. 2020 సెప్టెంబరులో గూగుల్ సంస్థ యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ షార్ట్స్ లో ఇన్సిడెంట్ ఏదైనా కనీసం 60 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోలను చేయాల్సి ఉంటుంది. కానీ... ఇకపై అంత వ్యవధితో పని లేదు. కేవలం 15 సెకన్లు... లేదా... అంతకంటే తక్కువ వ్యవధి ఉన్న వీడియోలను సైతం చేయవచ్చని గూగుల్ ప్రకటించింది. ఓ ఈవెంట్‌లో గూగుల్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలోనే కాకుండా, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రత్యేకించి... ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశగా చెబుతున్నారు. షార్ట్ వీడియోస్ చేయడం చాలా తేలిక. వీటికి వ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు ఛానల్ బ్రాండింగ్ వేగం సైతం పెరిగిపోతుంది.
0 Comments:
Post a Comment