WhatsApp: వాట్సాప్ మల్టీడివైజ్.. ఒక్కసారి లాగిన్ అయితే చాలు..ఇంటర్నెట్ లేకున్నా!

ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌ను యాప్, వెబ్ ఇలా వేర్వేరు పద్ధతుల్లో ఉపయోగించడం గురించి మనకు తెలిసిందే. అయితే వెబ్ వాట్సాప్ ఉపయోగించాలంటే మాత్రం మొబైల్ తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయివుండాల్సిందే. దీంతో ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు లేదా మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో లేనప్పుడు వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది. తాజాగా ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో యూజర్స్‌కి పరిచయం చేసింది. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
వాట్సాప్ మల్టీడివైజ్ ఫీచర్‌తో యూజర్స్ ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. అలానే వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించవచ్చు. ఒకవేళ వరుసగా 14 రోజులపాటు ప్రైమరీ డివైజ్ (వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్) మిగిలిన నాలుగు డివైజ్‌లతో అనుసంధానం కాకపోతే వాటిలోంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా లాగవుట్ అయిపోతుంది. అయితే వాట్సాప్ ఉన్న కంప్యూటర్, ట్యాబ్‌లెట్, పీసీ లేదా మొబైల్‌కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. గతంలో కేవలం వాట్సాప్ యాప్‌తోపాటు వాట్సాప్ వెబ్‌లో మాత్రమే లాగిన్ అవ్వగలిగేవారు. మరో డివైజ్‌లో లాగిన్ కావాలంటే అంతకు ముందు డివైజ్ నుంచి లాగవుట్ చేయాల్సిందే. మల్టీ డివైజ్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో.. ఒక్కసారి వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్ ఓపెన్ చేస్తే.. ప్రైమరీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకున్నా మిగిలిన డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు.
మల్టీ డివైజ్‌తో ఇవి చేయలేరు
మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా లాగిన్ అయిన యాప్ లేదా డెస్క్‌టాప్ డివైజ్‌ల నుంచి ఒకేసారి కాల్స్ చెయ్యలేరు. అలానే ఈ ఫీచర్ ద్వారా కనెక్ట్ అయిన డివైజ్‌లకు కాల్స్ రావు. లైవ్ లొకేషన్స్, కంపానియన్ డివైజ్‌లను చూడడటం, చాట్‌లను పిన్ చేయడం, గ్రూప్‌లలో జాయిన్ కావడం, గ్రూప్‌లను చూడటం, గ్రూప్‌లలోకి ఇన్వైట్ చేయడం వంటివి చేయలేరు. ఇక వాట్సాప్ బిజినెస్ యూజర్స్ తమ ఖాతాల పేర్లు, లేబుల్స్‌ని వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ నుంచి ఎడిట్ చేయలేరు.
logo
హోంఈనాడు హోం
Search...
టెక్ వార్తలు
Published : 07/11/2021 14:40 IST
WhatsApp: వాట్సాప్ మల్టీడివైజ్.. ఒక్కసారి లాగిన్ అయితే చాలు..ఇంటర్నెట్ లేకున్నా!
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌ను యాప్, వెబ్ ఇలా వేర్వేరు పద్ధతుల్లో ఉపయోగించడం గురించి మనకు తెలిసిందే. అయితే వెబ్ వాట్సాప్ ఉపయోగించాలంటే మాత్రం మొబైల్ తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయివుండాల్సిందే. దీంతో ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు లేదా మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో లేనప్పుడు వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌ను యూజర్స్‌కి పరిచయం చేసింది. తాజాగా ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో యూజర్స్‌కి పరిచయం చేసింది. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
ఎలా పనిచేస్తుంది
వాట్సాప్ మల్టీడివైజ్ ఫీచర్‌తో యూజర్స్ ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. అలానే వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించవచ్చు. ఒకవేళ వరుసగా 14 రోజులపాటు ప్రైమరీ డివైజ్ (వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్) మిగిలిన నాలుగు డివైజ్‌లతో అనుసంధానం కాకపోతే వాటిలోంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా లాగవుట్ అయిపోతుంది. అయితే వాట్సాప్ ఉన్న కంప్యూటర్, ట్యాబ్‌లెట్, పీసీ లేదా మొబైల్‌కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. గతంలో కేవలం వాట్సాప్ యాప్‌తోపాటు వాట్సాప్ వెబ్‌లో మాత్రమే లాగిన్ అవ్వగలిగేవారు. మరో డివైజ్‌లో లాగిన్ కావాలంటే అంతకు ముందు డివైజ్ నుంచి లాగవుట్ చేయాల్సిందే. మల్టీ డివైజ్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో.. ఒక్కసారి వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్ ఓపెన్ చేస్తే.. ప్రైమరీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకున్నా మిగిలిన డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు.
మల్టీ డివైజ్‌తో ఇవి చేయలేరు
మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా లాగిన్ అయిన యాప్ లేదా డెస్క్‌టాప్ డివైజ్‌ల నుంచి ఒకేసారి కాల్స్ చెయ్యలేరు. అలానే ఈ ఫీచర్ ద్వారా కనెక్ట్ అయిన డివైజ్‌లకు కాల్స్ రావు. లైవ్ లొకేషన్స్, కంపానియన్ డివైజ్‌లను చూడడటం, చాట్‌లను పిన్ చేయడం, గ్రూప్‌లలో జాయిన్ కావడం, గ్రూప్‌లను చూడటం, గ్రూప్‌లలోకి ఇన్వైట్ చేయడం వంటివి చేయలేరు. ఇక వాట్సాప్ బిజినెస్ యూజర్స్ తమ ఖాతాల పేర్లు, లేబుల్స్‌ని వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ నుంచి ఎడిట్ చేయలేరు.
ఎలా కనెక్ట్ చేయాలి
వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వెబ్ వాట్సాప్‌కి కనెక్ట్ అయ్యేందుకు లింక్ డివైజ్‌పై క్లిక్ చేయాలి. అందులో మీకు ‘యూజ్ వాట్సాప్ ఇన్ అదర్ డివైజెస్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ వాట్సాప్‌ని ఒకేసారి నాలుగు డివైజ్‌లలో ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్ చెబుతోంది. అయితే ఐఓఎస్ యూజర్స్ మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ ఫీచర్ రాకుంటే తమ మొబైల్స్‌లో వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేయాలి. అప్పటికీ రాకుంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. అలానే వాట్సాప్ మాతృసంస్థ పేరును ఫేస్‌బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్‌లో వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్ అని కాకుండా వాట్సాఫ్ ఫ్రమ్ మెటా అని కనిపిస్తుంది.
0 Comments:
Post a Comment