WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. 'Last Seen' కు సంబంధించిన మరో సూపర్ ఆప్షన్.. తెలుసుకోండి..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తన కస్టమర్లకు థ్రిల్ ఇస్తూనే ఉంటుంది.
తాజాగా యూజర్లకు ప్రైవసీకి సంబంధించిన మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.
వాట్సాప్ లో లాస్ట్ సీన్ ఫీచర్ గురించి మనకు తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా మనం గతంలో ఏ సమయంలో వాట్సాప్ యాప్ లోకి వచ్చామో అవతలి వారికి తెలుస్తుంది. అయితే.. లాస్ట్ సీన్ కనిపించకుండా దానిని Hide చేసుకునే ఆప్షన్ కూడా ఇప్పటికే అందించింది వాట్సాప్.
ఇప్పటి వరకు లాస్ట్ సీన్ కు సంబంధించి మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అవి.. 1. Everyone, 2. My Contacts, 3. Nobody.
మొదటి ఆప్షన్ ను ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వివరాలు అందరికీ కనిపిస్తాయి. రెండో ఆప్షన్ ను ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వారి ఫోన్ లో సేవ్ అయిన కాంటాక్ట్ నంబర్ల వారికే కనిపిస్తాయి. మూడో ఆప్షన్ ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వివరాలు ఎవరికీ కనిపించవు.
అయితే.. ఈ మూడు ఆప్షన్లతో పాటు My Contacts Except. అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మనం ఎంచుకున్న వారికి మాత్రమే మన Last Seen వివరాలు కనిపిస్తాయి.
ప్రొఫైల్ ఫొటో, About ను చూసేందుకు సైతం ఇలాంటి ఆప్షన్లను తీసుకురానుంది Whatsapp. దీంతో ప్రొఫైల్ ఫొటో, About అందరికీ కనిపించకుండా నియంత్రించవచ్చు.
ఆండ్రాయిడ్ 2.21.23.13 అప్‌డేట్లో వాట్సాప్ బీటా టెస్టర్లకు అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చినట్లు WABetaInfo తెలిపింది. త్వరలో ఈ ఫీచర్లు యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
0 Comments:
Post a Comment