నెట్టింటిని ముంచెత్తుతున్న మీమ్స్
ఇంటర్నెట్ డెస్క్: టమోటా కూర, రసం, చట్నీ, జ్యూస్..
ఇలా మధ్యతరగతి జీవుల వంటల్లో, వంట గదిలో టమోటాదే రాజ్యం. ప్రతి వంటలోనూ ఆ కూరగాయ హస్తం ఉండాల్సిందే. అప్పుడే రుచికి రుచీ వస్తుంది. ఒదుగూ అవుతుంది. ఏ కొత్తరకం వంటకం చేసుకోవాలన్నా టమాట ముక్కకి వాటా ఇవ్వాల్సిందే. ఇక బయటకు వెళ్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సాస్ రూపంలో మనకంటే ముందే బల్లపై దర్శనమిస్తుంది..! ఇలా చెప్పుకుంటే పోతే.. ఉపయోగాలకు కొదవేం లేదు. కానీ.. ఇప్పుడీ టమోటా పురాణం ఎందుకెత్తుకున్నారనుకుంటున్నారా..? ఇంకేముంది.. రూ.20 కంటే తక్కువకు దొరికే టమోటా ఇప్పుడు కొన్నిచోట్ల రూ.100 దాటేసింది. అందుకే బయటకెళ్లి ట'మాట' మాట్లాడాలంటే భయమేస్తుంది. దాని ధరకు గుండె దడ పెరిగిపోతోంది. ఆ కూరగాయ రెక్కలు కట్టుకుని గాల్లోకి ఎగురుతూ చుక్కలు తాకుతోంది..! ఈ పరిస్థితుల్లో కూడా సగటు జీవి తన బాధను గుండెల్లో దాచుకొని.. మీమ్స్ రూపంలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నాడు..! అవేంటో ఒకసారి మీరూ చూసేయండి..!
ఎక్కువ టమోటాలు ఉన్న వ్యక్తి దేశంలోనే అత్యంత ధనికుడని, రెండు కేజీలు టమోటా కొన్న వ్యక్తికి భద్రత అవసరమంటూ మీమ్స్ నెట్టింటిని ముంచేస్తున్నాయి. మెక్డోనాల్డ్స్లో బర్గర్ ఉచితమట, కెచప్కి మాత్రం రూ.65 తీసుకుంటారట. ఇక జొమాటోను టమోటా అని పొరబడి తక్కువ రేటింగ్ ఇవ్వకండంటూ జొమాటో హాస్యం ఒలికించింది. వాటిలో మరికొన్ని మీమ్స్ మీకోసం..
0 Comments:
Post a Comment