Tipu Sultan's Throne: టిప్పు సుల్తాన్ సింహాసనపు బంగారు తలను వేలానికి పెట్టిన ఇంగ్లాండ్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
భారత్ నుంచి దొంగిలించిన టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని బ్రిటన్ ప్రభుత్వ డిజిటల్, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖ వేలం వేస్తోంది.
టిప్పు సుల్తాన్ వినియోగించిన సింహాసనాన్ని రూ.14.98 కోట్లకు వేలం వేయనుంది. 18వ శతాబ్దంలో మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన సింహాసనపు బంగారు తలను శుక్రవారం ఇంగ్లాండ్ వేలంలో పెట్టింది. మైసూర్ టైగరుగా ప్రసిద్ధి చెందిన టిప్పు సుల్తాన్ సింహాసనంలో ఉన్న ఎనిమిది బంగారు తలల్లో ఇది చివరిది. ''ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టిప్పు సుల్తాన్ సింహాసనానికి భారీ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.భారతదేశంలో బ్రిటీషర్ల భాగస్వామ్య పాలన గురించి ఈ తరానికి తెలియజేయటమే మా ఉద్దేశ్యం.
ఈ వేలం పాటను అందుకే నిర్వహిస్తున్నాం.'' అని యూకే ఆర్ట్స్ మినిస్టర్ లార్డ్ స్టీఫెన్ పార్కిన్సన్ చెప్పారు. అయితే, టిప్పు సుల్తాన్ సింహాసనం యూకే దాటిపోయే ప్రమాదం ఉందని, ఆసక్తి గలకొనుగోలుదారులు కమిటీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన0845 300 6200 నంబరుకు కాల్ చేయాలనిబ్రిటన్ ప్రభుత్వ డిజిటల్, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖట్వీట్చేసింది.
ఈ ట్వీట్‌పై ఇప్పటికేఅనేక మంది స్పందించారు. అయితే, ఈ వేలంపాటను కొందరు వ్యతిరేకిస్తున్నారు. దోచుకున్న వస్తువులను విక్రయించడానికి ప్రయత్నించడం, ఎగుమతి నిషేధంపై అనేక మంది నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.బ్రిటిష్ మ్యూజియం అసలైన బ్రిటిష్ వస్తువులను వేలానికి పెట్టాలని ఓస్లో అనే వ్యక్తి రీట్వీట్ చేశారు. టిప్పు సుల్తాన్ ను ఓడించి ఈస్ట్ ఇండియా కంపెనీ సింహాసనాన్ని దోచుకుందని మరొకరు రీ ట్వీట్ చేశారు.
వేలం పాటను వ్యతిరేకిస్తున్న నెటిజన్లు..
బంగారంతో చేసిన, కెంపులు, వజ్రాలు, పచ్చలు పొదిగిన ఈ సింహాసనం 18వ శతాబ్దపు దక్షిణ భారత స్వర్ణకారుల పనికి అరుదైన ఉదాహరణగా కొందరు వర్ణించారు. అరుదైన వాటిలో ఇదొకటి, దీనిపై ఉన్న బంగారు శాసనం ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. ఎగుమతి లైసెన్సుపై నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకు వాయిదా వేశారు. జీబీపీ సిఫార్సు చేసిన రూ.14.98 కోట్ల ధరకు విక్రయించేందుకు వచ్చే ఏడాది జూన్ 22 వరకు వేలం పొడిగించే అవకాశం ఉంది.
కాగా, టిప్పు సుల్తాన్ రాజధాని సెరింగపట్నంలో 1799లో ఓడిపోయి, మరణించిన తరవాత ఆయన సింహాసనాన్ని బ్రిటీష్ ఆర్మీకి చెందిన ప్రైజ్ ఏజంట్లు దాన్ని ముక్కలు చేశారు. ఇప్పుడు వేలానికి ఉంచిన బంగారు పులి తల అష్టభుజి సింహాలలో ఒకటని ఆర్.సి.ఈ.డబ్యూ.ఎ సభ్యుడు క్రిస్టోఫర్ రోవెల్ చెప్పారు.
సింహాసనం ఇతర భాగాలతో సహా అన్ని భాగాలు దేశంలోనే ఉంటాయని తాను ఆశిస్తున్నట్టు క్రిస్టోఫర్ అభిప్రాయపడ్డారు. '' పులి, దాని చారలు టిప్పు సుల్తాన్ వ్యక్తిగత చిహ్నాలు, వెయ్యేళ్లు గొర్రె మాదిరిగా జీవించడం కంటే టిప్పు సుల్తాన్ లా ఒక్క రోజు పులిలా జీవించడం మేలని'' క్రిస్టోఫర్ అభివర్ణించారు. 1799లో తమచేతిలో ఓడిపోయే వరకు టిప్పు సుల్తాన్ పెద్ద ముప్పుగాబ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. టిప్పు ఓటమి తరవాత అనేక వస్తువులు బ్రిటన్ చేరాయి.
0 Comments:
Post a Comment