టైగర్ ప్రభాకర్.. ఓ సినిమాలో నిజంగా పులితో పోరాడిన నటుడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విలన్. పులంటేనే భయపడే జనాలున్న వేళ పులితోనే కొట్లాడిన గొప్ప నటుడు. ప్రభాకర్.. ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు. తన అద్భుత నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. చిన్న వయసులోనే సినిమా రంగంలోకి వచ్చాడు ప్రభాకర్.. కెరీర్ ఆరంభం నుంచి విలన్ పాత్రలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీకారం సినిమాలో ఆయన చేసిన సాహసం అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ సినిమాలో నిజంగానే పులితో ఫైట్ చేశాడు. అప్పటి నుంచి ప్రభాకర్ కాస్త.. టైగర్ ప్రభాకర్ గా మారిపోయాడు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ వ్యక్తిగత జీవితం మాత్రం కష్టల మయంగా సాగింది.
ప్రభాకర్ తెలుగుతో పాటటు కన్నడ, తమిళ, మరికొన్ని ఇతర భాషల్లో కలుపుకుని 300 సినిమాల్లో నటించాడు. కొంత కాలం బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి సత్తా చాటాడు. తెలుగులో టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సహా పలువురి సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి కాస్త తెలుసుకుందాం.. ప్రభాకర్ మూడు వివాహాలు చేసుకున్నాడు. 1985లో ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయమాలను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు.
అనంతరం 1995లో మరో వివాహం చేసుకున్నారు. పలు సీరియల్స్ లో నటించిన కన్నడ నటి అంజును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే వీరు విడిపోయారు. ఆ తర్వాత పభాకర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. 2000 సంవత్సరంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆరోగ్య సమస్యలకు తోడు ఆయనకు జాండిస్ వచ్చింది. 2001 మార్చి 25న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటించి.. ఎంతో గొప్పగా బతికిన ప్రభాకర్ చివరి రోజుల్లో ఎవరూ చూసుకునే వారు లేక ఆవేదనతో చనిపోయారు.
0 Comments:
Post a Comment