TCS Jobs: ఆ కోర్సు పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
దిగ్గజ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.
ఇటీవల 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్' (TCS Smart Hiring Program) దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు డిగ్రీ పాస్ అయినవారు నవంబర్ 30 లోగా దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ (TCS MBA hiring program) ద్వారా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది టీసీఎస్. దరఖాస్తు గడువు నవంబర్ 9న ముగుస్తుండటంతో అప్లికేషన్ డెడ్‌లైన్ పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు.
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది కంపెనీ. ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌కి నవంబర్ 21న టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది టీసీఎస్. దీంతో టెస్ట్ తేదీని ప్రకటించాల్సి ఉంది.
విద్యార్హతలివే...
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌కు 2020, 2021లో ఎంబీఏ పాస్ అయినవారు, 2022 లో ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేవారు దరఖాస్తు చేయొచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జనరల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్స్‌లో ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఏ, పీజీడీఎం కోర్సులు పాస్ అయినవారు, చదువుతున్నవారు అప్లై చేయొచ్చు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సుల్లో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. బ్యాక్‌లాగ్స్ ఉంటే సెలెక్షన్ ప్రాసెస్ జరిగేనాటికి ఆ సబ్జెక్ట్స్ పాస్ కావాలి. ఎంబీఏ కన్నా ముందు బీటెక్ లేదా బీఈ చదివి ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
TCS Smart Hiring Program: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు https://www.tcs.com/careers/management-hiring-yop-2020-2022 లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో ఇన్‌స్ట్రక్షన్స్ చదవాలి.
Step 3- ఆ తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- మీరు రిజిస్టర్డ్ యూజర్ అయితే లాగిన్ చేసి 'Apply For Drive' పైన క్లిక్ చేయాలి.
Step 5- కొత్త యూజర్ అయితే Register Now పైన క్లిక్ చేయాలి.
Step 6- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.
Step 7- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 10- స్టేటస్ Applied for Drive అని కనిపిస్తే అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతం అయిందని అర్థం.
0 Comments:
Post a Comment