Tablets: మద్యం సేవించిన సమయంలో పొరపాటున కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదట..
ఆహారం విషయంలో కొంతమంది ఎన్నో జాగ్రత్తలు వహిస్తుంటారు.
కానీ కొంతమంది అన్నీ కలిపి తింటుంటారు. తాగుతుంటారు. ఇలా ఒక క్రమపద్ధతి లేకుండా అన్నీ కలుపుకుని తిన్నా, తాగినా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. అంతేకాకుండా డబ్బుంది కదా అని కనిపించిందల్లా తింటే ఆ తర్వాత జబ్బులు వస్తాయి.
ఇక ఆపై మాత్రలు, చేదు టానిక్‌లు. ఇలా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని ట్యాబ్లెట్స్‌ను కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత వేసుకోకూడదు. అలా మాత్రలు మింగడం వల్ల ఉన్న రోగం తగ్గకపోగా. కొత్త జబ్బుల బారిన పడే అవకాశముంది. అలాంటి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందాం..
రిటాలిన్ ట్యాబ్లెట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నరాల బలహీనత ఉన్నవారు ఉత్తేజం కోసం ఈ ట్యాబ్లెట్స్‌ను వాడతారు. ఈ ట్యాబ్లెట్స్ వాడేవారు చాక్లెట్‌ను తినకపోవడం మంచిది. ఎందుకంటే చాక్లెట్‌లో ఉండే తియోబ్రోమిన్ అనే రసాయనం, రిటాలిన్ ట్యాబ్లెట్‌లోని రసాయనం కలిస్తే మూర్ఛ వచ్చే అవకాశముంది.
మద్యపానం అలవాటున్న వారు జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు తగ్గడానికి వేసుకునే మాత్ర ఎసిటామినోఫెన్‌ను మద్యం సేవించిన సమయంలో వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాల్సి వచ్చినా 6 గంటల తర్వాతే వేసుకోవాలి. ఎలర్జీతో బాధపడేవారు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కానీ, ఎలర్జీ సిరప్ తాగినప్పుడు కానీ యాపిల్ జ్యూస్‌ను తాగకూడదు. ఇలా తాగితే డ్రగ్ పనిచేయకపోగా, కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఇంకా పెరిగే అవకాశముంది.
దగ్గు టానిక్ తాగే ముందు గానీ, తాగిన తర్వాత గానీ నిమ్మకు సంబంధించిన ఎలాంటి పానీయం, ఆహారం తీసుకోకూడదు. అలా తాగితే ఎంజైమ్స్‌ను నిమ్మలోని గుణం నియంత్రిస్తుంది. దీనివల్ల స్టాటిన్స్ ప్రభావం తగ్గి రక్తపోటు వస్తుందట. మెంటోస్, పిప్పర్‌మెంట్ లాంటివి నమిలి ఆ తర్వాత కూల్‌డ్రింక్ సేవించకూడదు. అలా గానీ తాగితే సైనైడ్ అనే విష రసాయనం తయారై మరణించే అవకాశముంది.
నిమ్మ రసం తాగిన వెంటనే పాలు తాగడం అత్యంత ప్రమాదకరం. అలా తాగితే పొట్టలో యాసిడ్స్ తయారై కడుపుమంట, గుండెల్లో మంట వచ్చే అవకాశం అధికంగా ఉంది. పాలు, పాల సంబంధిత పదార్థాలు తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోకూడదు. అలా వేసుకుంటే పాలలో ఉన్న కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ యాంటిబయాటిక్స్‌ను నియంత్రిస్తాయి. దీనివల్ల మందులు వేసుకున్నా ఉపయోగం ఉండదు. మాంసం తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోవద్దు. ఇలా గానీ వేసుకుంటే రక్తపోటు పెరిగి ప్రాణాల మీదకు తెస్తుంది.
0 Comments:
Post a Comment