బిజీ లైఫ్ కారణంగా వేళకు ఎవరూ సరిగా తినడం లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏదో అరకోర తినేసి పనిచేస్తున్నారు. పని పట్ల నిబద్దత కావచ్చు.. ఒత్తిడీ కావచ్చు.
ఇక వేళకు తినకుండానే నిద్ర (Sleep)కు ఉపక్రమిస్తున్నారు ఇప్పటి జనం. దీంతో అర్ధరాత్రి వేళ ఆకలి (Hungry at Night) సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు చాలామంది బరువు (weight)ని కరెక్టుగా ఉంచుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ అనే పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చాలానే చూస్తూ ఉన్నారు. చాలామంది ఎంత ఆకలి వేసినప్పటికీ కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే మరింత మితం గా ఆహారం (food) తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో నిద్ర సమస్యలూ తలెత్తుతున్నాయి. కొన్ని చిట్కాలు (Tips) పాటిస్తే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
రాత్రిళ్లు ఏం తినాలి..
రాత్రిళ్లు ఏం తినాలి అనేది చాలా మందికి అర్థం కాదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం (healthy food) రాత్రిళ్లు భుజించాలి. ఉప్పు, చక్కెర(sugar) పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రిళ్లు మీ కండరాలు, ఇతర టిష్యూలు రిపేర్ చేసుకునే మోడ్‌లోకి జారుకుంటాయి. అలాగే శరీరం(body) కూడా పలు క్రియలను నిద్రలో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టేందుకు ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు ఆహారంలో పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. విటమిన్ బి6, ట్రైటోఫాన్, అలాగే కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.
దుస్తులు లేకుండా..
పర్సనల్ బెడ్రూం(bedroom)లు ఉన్నవారిలో కొద్దిమందికి దుస్తులు లేకుండా(Without dress) పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే బయటికి మాత్రం చాలామంది అలా చెప్పరు. ఏదో అనుకుంటారని. అయితే మామూలుగా పడుకునే వారికంటే అలా దుస్తులు లేకుండా పడుకునే వారికే హాయిగా నిద్రపడుతుందట (Happy sleep). అంతేకాదు అలా పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ(Health benefits) ఎక్కువేనట. దుస్తులు తొలగించి నిద్రపోవడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గుతుంది (Decreasing body Temperature). దీని కారణంగా వేగంగా నిద్రపోవచ్చు. చాలామంది నిద్ర పోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దుస్తులు తొలగించి నిద్ర పోవడం వల్ల నిద్ర యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) నిద్రపోయేటప్పుడు రూమ్ టెంపరేచర్ చాలా ముఖ్యం అని చెబుతోంది. బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల చల్లదనం ఉంటుంది. దీనితో నిద్ర(Sleep) యొక్క నాణ్యత కూడా పెరుగుతుందట.
0 Comments:
Post a Comment