ఐదు నెలలైనా అందని వేతనాలు
ఒప్పంద ఉపాధ్యాయుల ఎదురుచూపులు
*వినుకొండ, న్యూస్టుడే*: ఒప్పంద ప్రాతిపదికన నియమితు లైన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఐదు నెలలు దాటినా వేతనాలంద లేదు. ఎప్పుడు ఇస్తారో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వర్త మానం అందలేదు. ఏనెలకనెల వచ్చిన జీతం డబ్బుతో ఉప్పుప ప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉన్న వీరంతా ఎంతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది ఉండగా, గుంటూరు జిల్లాలో 200 మంది ఉన్నారు. బీఈడీ అర్హ తతో 2008 డీఎస్సీలో ఎస్జీటీలుగా ఎంపికయ్యారు. కోర్టు వివాదాల అనంతరం సుమారు 13 ఏళ్ల తర్వాత వారిని ప్రభుత్వం ఒప్పంద పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించింది. మినిమం టైంస్కేల్ కింద నెలకు రూ.21230 వంతున వేతనం చెల్లించే విధంగా ఈ ఏడాది జులై 12న నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్ 23న వీరి ఉద్యోగ ఒప్పందం రద్దు చేసి, తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కాగానే పునరుద్ధరిస్తామని ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు. ఈ పద్ధతిలో బొల్లాపల్లి మండలంలో 15, వినుకొండలో నలుగురు ఉండగా, మిగిలిన వారంతా వివిధ మండలాల్లో పని చేస్తున్నారు. క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని ఒప్పంద ఉపాధ్యాయులు వేడుకొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment