🔳ఎస్‌డిఎం కాలేజీలో 281 మంది విద్యార్థులకు కరోనా
బెంగళూరు : కర్ణాటక ధార్వాడలోని ఎస్‌డిఎం వైద్య కళాశాలని కరోనా హడలెత్తిస్తోంది. తాజాగా ఈ కళాశాలలోని 281 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ కళాశాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల్ని మూసివేశారు. కేసులు పెరుగుతుండడంతో ఆ కాలేజీ కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. మరోవైపు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిన 113 మంది శాంపిల్స్‌ని బెంగళూరులోని జినోమ్‌సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు తరలించారని.. వీటి నివేదికలు డిసెంబర్ 1 వరకు వచ్చే అవకాశముందని ఆరోగ్యశాఖ కమిషనర్ డి. రణ్‌దీప్ వెల్లడించారు.
ఇటీవల ఎస్‌డిఎం కాలేజీలో ఫ్రెషర్స్‌డే పార్టీ వేడుకలు మూడురోజులపాటు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొదట 66 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆ తర్వాత మరికొంతమందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తంగా 281 మందికి ఈ మహమ్మారి సోకినట్టు గర్తించారు
0 Comments:
Post a Comment