Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 13 November 2021

Scholarship Programmes: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్ ల వివరాలివే.. తెలుసుకోండి

 Scholarship Programmes: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్ ల వివరాలివే.. తెలుసుకోండి..

కరోనా (Corona) కారణంగా అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు.

చాలా మంది చిరు వ్యాపారులు లాక్ డౌన్ల (Lock Down) కారణంగా దెబ్బతిన్నారు. దీంతో అలాంటి వర్గాల ప్రజలు వారి పిల్లల చదువులకు(Education) ఖర్చు చేసేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు విద్యార్థులు (Students) కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు పలు ప్రముఖ సంస్థలు అందించే స్కాలర్ షిప్ (Scholarship) లను సద్వినియోగం చేసుకుంటే ఫీజుల చెల్లింపు భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో అప్లై చేసుకోవాల్సిన పలు స్కాలర్ షిప్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. STFC India Meritorious Scholarship Programme 2021:

శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ(STFC) లిమిటెడ్ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల పిల్లలకు ఈ స్కాలర్ షిప్ ను అందించనున్నారు. టెన్త్, ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు.

అర్హత: డిప్లొమా/ఐటీఐ/పాలిటెక్నిక్ కోర్సులు లేదా -గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సుల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు టెన్త్, ఇంటర్ కోర్సుల్లో 60 శాతం మార్కులను సాధించి ఉండాలి.

-అభ్యర్థులు తప్పనిసరిగా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 4 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2021

అప్లికేషన్ లింక్: www.b4s.in/it/SIMD4

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కింద ఎంపికైన విద్యార్థులు ఐటీఐ/పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సులకు గాను ఏడాదికి రూ. 15 వేలు, గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ కోర్సులకు ఏడాదికి రూ. 35 వేల చొప్పున స్కారల్ షిప్ ను పొందుతారు.

2. IIT Roorkee Chemistry Department Post Doctoral Fellowship (PDF) 2021:

ఐఐటీ రూర్కీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ PhD చేసిన అభ్యర్థులకు స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు 'Chemical Proteomic Approach to Identify Snrall Molecule Covalent inhibitors to Target Protein-Protein Interactions in BCI-2 Proteitrs' ప్రాజెక్టుపై పని చేయాల్సి ఉంటుంది.

-కెమిస్ట్రీ (కెమికల్ బయాలజీ)/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందిన మరియు ఇటీవల తమ థీసిస్‌ను సమర్పించిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు.

స్కాలర్ షిప్ మొత్తం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

చివరి తేదీ: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Application mode: అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆఫ్ లైన్ అప్లికేషన్లను The Head Department of chemistry, India Institute of Technology Roorkee Roorkee- 247667 Uttarakhand, India చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. లేదా venkatesh.v@cy.iitr.ac.in మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ లింక్: https://www.iitr.ac.in/administration/uploads/File/ch/2021/adv07102021.pdf

3. Ericsson Empowering Girl Scholarship Programme 2021:

ఎరిక్సన్ సంస్థ ప్రతిభ కలిగిన బాలికలకు చేయూత అందించేందుకు ఈ స్కాలర్ షిప్ ను తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ సెకండియర్(IT/CS) చదివే అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ చేసే వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

అర్హత: ఐటీ/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ చదువుతున్న వారు కూడ ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

-ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షల లోపు ఉండాలి.

స్కాలర్ షిప్: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 75 వేల స్కాలర్ షిప్ అందించనున్నారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021

అప్లికేషన్ డైరెక్ట్ లింక్: www.b4s.in/it/EEGS2

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top