నేను ఈరోజు రాత్రి చిత్తూరు లోని జైహింద్ స్కూల్ లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఇతని పేరు సాదిక్ ఖాన్. చిత్తూరులో అంబులెన్సు నడుపుకుని జీవనం సాగిస్తాడు. సాదా సీదాగా కనిపిస్తున్నా, ఇతను సేవా భావం, మానవత్వం మూర్తిభవించిన గొప్ప మనిషి, ఎక్కడ గుర్తుతెలియని శవం కనిపించినా అనాధ శవం కనిపించినా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజలు ఇతనికే ఫోన్ చేస్తారు. సాదిక్ హుటాహుటిన అర్థరాత్రి అయినా వర్షమైనా ,చలైనా అక్కడ వాలిపోతాడు. సొంత మనుషులకు చేసినట్లు అన్నీ చేస్తాడు. చనిపోయిన వారి మతాచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహిస్తాడు. దిక్కు లేని వారు అనారోగ్యంతో ఎక్కడ కనిపించినా వారిని తన అంబులెన్సులో ఆసుపత్రులకు చేరుస్తాడు. అసహ్యించు కోకుండా సేవలు చేస్తాడు. 🙏ఇవన్నీ చేసేది ఇది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగానే.🙏 పది మందికి సేవ చేయడంలో దైవత్వం ఉందని వినయంగా చెబుతాడు సాదిక్. ఇంత గొప్ప మనసున్న సాదిక్ ఎంతోమందికి ఆదర్శనీయం అనుసరణీయం.
-
గంటా మోహన్, టీచర్ , చిత్తూరు
0 Comments:
Post a Comment