ఒప్పంద ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకం కోసం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా నోటిఫికేషన్‌లో లోపాలను ఎత్తిచూపిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య... దాన్ని సస్పెండ్ చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఆర్‌జీయూకేటీ తరఫు న్యాయవాది స్పందిస్తూ సంబంధిత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించాచారు. ఒప్పంద పద్ధతిలో బోధనా సిబ్బంది నియామకం కోసం నూజివీడులోని ఆర్‌జీయూకేటీ 2021 అక్టోబరు 29 ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన షేక్ నజీర్ హుసేన్ మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది డి.అనిల్‌కుమార్ వాదనలు వినిపించారు.
0 Comments:
Post a Comment