✍ఆర్జీయూకేటీ కౌన్సెలింగ్ తేదీలు పొడిగింపు
🌻సాక్షి, అమరావతి/ వేంపల్లె/ నూజివీడు
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూ కేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హిస్తున్న కౌన్సెలింగ్ తేదీలను పొడిగిస్తున్నట్లు వర్సిటీ చాన్సలర్ కె.చెంచురెడ్డి, వీసీ (ఇన్ఛార్జి) కె.హేమచంద్రా రెడ్డిలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. కొద్ది మార్పులు చేస్తూ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న కౌన్సెలింగ్కు హాజరు కావాల్సిన అభ్యర్థులు కొత్త షెడ్యూల్ ప్రకారం 24వ తేదీన హాజరు కావాలని సూచించారు. తదుపరి తేదీ ల్లోని అభ్యర్థులకు కూడా 2 రోజుల పాటు పొడిగింపు ఉం టుందన్నారు. మరిన్ని వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్జీయూకేటీ.కాం వెబ్సైట్లో పొందుపరిచారు.
0 Comments:
Post a Comment