PPF accounts merger: ఒక వ్యక్తికి ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే.. ఖాతాల విలీనంపై కేంద్రం మార్గదర్శకాలు
వ్యక్తిగతంగా ఒకరు ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) ఖాతా మాత్రమే కలిగి ఉండాలి. అందుకే, పీపీఎఫ్ ( PPF) జమ చేసే సంస్థలు ఒకరి పేరుతో అనేక ఖాతాలుతెరవడాన్ని తప్పుగా పరిగణిస్తాయి.
ఇలా ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు కలిగిన వారి ఖాతాలను విలీనం చేసేలాకేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్‌లో రుణాలు చెల్లించాలి
రెండు ఖాతాలను ఒకటిగా మార్చుకునే ముందు పీపీఎఫ్ ( Public Provident Fund) అవుట్‌స్టాండింగ్ లోన్ అమౌంట్‌ను క్లియర్ చేసుకోవాలి.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలపై ఎలాంటి రుణాలు లేవని నిర్థరణ చేసుకోవాలి. ఆ తర్వాతే రెండు ఖాతాలను మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాల విలీనం కొరకుఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్దమవుతోంది.
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉంటే...
ఇప్పటికే డిపాజిట్లకు ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉంటే అలా ఉన్న ఖాతాలను మూసివేసేందుకు వారికే అవకాశం కల్పించారు. ఏ ఖాతా మూసివేయాలనేది డిపాజిటర్ నిర్ణయించుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉంటే వాటిలో ఒకటి మాత్రమే ఉండేలా చూసుకోవాలి. మూసివేసిన ఖాతాల్లోని సొమ్మును, వారు నిర్వహించాలనుకుంటున్న ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకుల ఖాతాలు కొనసాగించాలనుకునే డిపాజిటర్లు పాస్ బుక్, బ్యాంకు స్టేట్ మెంటు కాపీలతో వారికి రిక్వెస్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. డిపాజిటర్లు పంపిన రిక్వెస్టులను పరిశీలించిన బ్యాంకులు, పోస్టాఫీసుల అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఏ ఖాతా ఉంచుకుంటారో మీ ఇష్టం...
ఇలా ఏ ఖాతానైతే మూసివేయాలనుకుంటున్నారో ఆ ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకులు, తపాలా కార్యాలయాలు మీ ఖాతాలోని సొమ్మును, మీరు నిర్వహించాలనుకుంటున్న పీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తాయి. ఇలా రెండు ఖాతాలు ఒకదాంట్లో కలుపుతాయి. ఇలా చేయడం ద్వారా పీపీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం పీపీఎఫ్ లో డిపాజిట్ల సీలింగ్ ను తెలుసుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది.
డిపాజిట్ చేసిన తేదీ ఆధారంగా మెచ్యూరిటీ..
పీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేసిన తేదీలను బట్టి, మెర్జ్ చేసిన ఖాతాలో డిపాజిట్ల మెచ్యూరిటీని లెక్కిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ కన్నా ఒక ఏడాదిలో ఎక్కువ డిపాజిట్లు చేసి ఉంటే ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా ఖాతాదారులకు తిరిగి వెంటనే చెల్లిస్తారు. పీపీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ముందు అకౌంట్స్ కార్యాలయం వడ్డీని, అసలు మొత్తంలో కలిపి బదిలీ చేస్తుంది. ఏ ఖాతా కొనసాగించాలనుకుంటున్నారో ఆ ఖాతాకు సొమ్ము బదిలీ అవుతుంది.
0 Comments:
Post a Comment