Policy for Surrender of Willing Private Aided Educational Institutions in the State to Government - Clarification and Certain Instructions issued
ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించే విధానములో 4 రకాల ఆప్షన్స్ తో మార్పులు చెస్తూ క్లారిఫికేషన్ తో ఉత్తర్వులు విడుదల.
ఎయిడెడ్ విద్యా సంస్థలు తాము సరెండర్ చేసిన ఎయిడ్ /ఎయిడెడ్ పోస్టుల్ని తిరిగి వెనుకకు తీసుకొనుటకు అనుమతిస్తూ, అవకాశం కల్పిస్తూ (option 4) ప్రభుత్వ ఉత్తర్వులు.
Policy for Surrender of Willing Private Aided Educational Institutions in the State to Government - Clarification and Certain Instructions issued Cir.Memo.No.1072635/CE/A1/2020 Dated:12.11.2021
రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్ యాజమాన్యాలు గతంలో వారు స్వచ్ఛందంగా ఇచ్చిన ఐచ్ఛికాన్ని పునః పరిశీలించుకొనుటకు / గతంలో స్పందించని ఎయిడెడ్ యాజమాన్యాలకు ప్రభుత్వం మరొక అవకాశం ఇవ్వ సంకల్పించింది.క్రింది ఐచ్ఛికాలలో ఏదో ఒక ఐచ్ఛికాన్ని వారు ఎంచుకోవాల్సుంటుంది.
👉 ఐచ్ఛికం : 1
ఆస్తులు & సిబ్బందితో సహా వారి సంస్థలను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేయుటకు అంగీకారం తెలుపుట
👉 ఐచ్ఛికం : 2
ఆస్తులు మినహా సిబ్బందితో సహా ఎయిడెడ్ పోస్టులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేయుటకు అంగీకారం తెలుపుట.
👉 ఐచ్ఛికం : 3
ప్రస్తుతం అమలులో నియమ నిబంధనలు , గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొదలగు వానిని కొనసాగిస్తూ ఐచ్ఛికాలు 1 & 2 లకు అంగీకారం తెలుపకుండా ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలుగానే ఉండదలచుకోవటం.
👉 ఐచ్ఛికం : 4
గతంలో ఐచ్ఛికం 1 లేదా 2 లకు అంగీకారం తెలిపినప్పటికీ.... సరెండర్ చేయబడిన సిబ్బంది ని వెనుకకు తీసుకొని ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థగానే కొనసాగదలచుకొనుట.
*కావున , రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు పై ఐచ్ఛికాలలో ఏదో ఒక ఐచ్ఛికాన్ని ప్రస్తుతం ఎంచుకొనే క్రమంలో తగు చర్యలు తీసుకొనవలసిందిగా DSE AP వారిని, ఇంటర్ విద్య / కళాశాల విద్య / సాంకేతిక విద్య కమీషనర్ లను కోరుతూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.*
0 Comments:
Post a Comment