✍పీఎఫ్ ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టిన ఘనుడు
♦విశ్రాంత అధికారి ఆస్తుల జప్తు
🌻ఈనాడు, న్యూస్: ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్) ఖాతాలో సొమ్ము కొల్లగొట్టిన నిందితుడికి చెందిన రూ.1.13 కోట్ల ఆస్తులను హైదరాబాద్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జన్మచేసింది. ఈ మేరకు సోమవారం ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 'కడప ఉప ప్రాంతీయ కార్యాల యంలో సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కొండపల్లి సత్యనారాయణరావు. . తప్పుడు పత్రాలతో ఖాతాదారులకు చెందిన రూ.1.64 కోట్ల సొమ్మును తన తోపాటు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. దీనిపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా, ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రం(లైఫ్ సర్టిఫికేట్) సమ రించని పింఛనుదారులు, ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల పింఛను తీసు కోని వారి వివరాలను సత్యనారాయణరావు సేకరించినట్టు, బ్యాంకు ఖాతాల్లో వారి పేర్ల బదులు, తన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి డబ్బును మళ్లించు కున్నట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారణయింది. 2011-2014 మధ్య కాలంలో ఇలా రూ.1.64 కోట్లను కాజేసినట్టు తేలింది. అక్రమ నిధుల మళ్లింపు నిరోధక చట్టం (సి.ఎం.ఎల్.ఎ.) కింద పదవీ విరమణ చేసిన సత్యనారాయణరావుకు చెందిన రూ. 98.68 లక్షల విలువైన నివాసగృహం, ఆయన బ్యాంకు ఖాతా లోని రూ.12.64 లక్షల సొమ్మును జప్తచేశామని ఈడీ వెల్లడించింది. దర్యాప్త కొనసాగుతున్నట్లు పేర్కొంది.
0 Comments:
Post a Comment