🔳ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1% వడ్డీ
ఈనాడు, అమరావతి: ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రేట్లను ఏడాదికి 7.1% చొప్పున నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఇవి వర్తిస్తాయని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన జీపీఎఫ్ రేట్లకు అనుగుణంగా దీన్ని నిర్ణయించినట్లు తెలిపారు.
ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకరణకు నోడల్ అధికారి నియామకం: ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించేందుకు నోడల్ అధికారిగా ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి కె.ఆదినారాయణను నియమిస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్య ఆర్థిక కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
0 Comments:
Post a Comment