ONGC Recruitment 2021: బీటెక్ అర్హతతో ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు
బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారా? గేట్ 2021 స్కోర్ కూడా ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
గ్రాడ్యుయేట్ ట్రైనీ (Graduate Trainee) పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 309 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఓఎన్‌జీసీ. పలు బ్రాంచ్‌లల్లో బీటెక్, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 1 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, విద్యార్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment2021.ongc.co.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు గేట్ రిజిస్ట్రేషన నెంబర్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు మాత్రమే అప్లై చేయాలి. సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు గేట్ 2021 స్కోర్ ఉండాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
ONGC Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా...
Step 1- అభ్యర్థులు ముందుగా https://recruitment2021.ongc.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో New Applicants పైన క్లిక్ చేయాలి.
Step 3- గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, గేట్ అడ్మిట్ కార్డ్ లేదా గేట్ స్కోర్ కార్డులో ఉన్న మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 4- గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
Step 5- ఓటీపీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
Step 6- ఆ వివరాలతో లాగిన్ కావాలి.
Step 7- ఇక మీరు అంతకన్నా ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టైతే Existing Applicants ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
Step 8- Registration Status పైన క్లిక్ చేసి Go to Registration క్లిక్ చేయాలి.
Step 9- క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 10- అభ్యర్థి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 11- Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 12- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
Step 13- ఫీజు చెల్లించిన తర్వాత Submit పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 14- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
0 Comments:
Post a Comment