Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి NHRC మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపధ్యంలో వాటిపై నివేదిక ఇవ్వాలని గతంలోనే NHRC నోటీసులు ఇచ్చింది.
అయితే వాటికి ఏపీ ప్రభుత్వం స్పందించలేదు తాజాగా మరోసారి నోటీసులిచ్చిన NHRC రిప్లయ్ ఇవ్వకపోతే తాము తీసుకునే చట్టబద్ధ చర్యలకు సిద్ధపడాలంటూ హెచ్చరించింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు ఎక్కువవుతుండటం పట్ల NHRC కి కంప్లయింట్స్ వచ్చాయి. ఆ నేపధ్యంలోనే ఏపీకి నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకూ రిప్లయ్ ఇవ్వలేదు.
0 Comments:
Post a Comment