*✍నూతన విద్యావిధానం అమలులో ఏపీ టాప్
కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ సదస్సులో విద్యాశాఖ మంత్రి సురేష్
జాతీయ విద్యావిధానం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశా రు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు తో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలవుతున్నా యని వివరించారు. కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యు కేషన్ ఇన్ ఇండియా 50వ యాన్యువల్ కాన్ఫరెన్స్ విజయ వాడలోని ఓ హోటల్లో గురువారం ప్రారంభమైంది. సద స్సును ప్రారంభించిన మంత్రి డా. సురేష్ మాట్లాడుతూ నాడు- నేడు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో విద్యా రంగంలో వచ్చిన పెను మార్పుల కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లన్నీ నిండిపోయాయని వివరించారు. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీశేషగిరిబాబును ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని విద్యా శాఖ బోర్డులకు సంబంధించి 'బెస్ట్ ప్రాక్టీసెస్ బై బోర్డ్స్' అనే థీమ్తో ఈ సదస్సు జరుగుతోందని శేషగిరిబాబు తెలిపా రు. మూడు రోజులపాటు జరిగే సదస్సుకు వివిధ రాష్ట్రా ల్లోని 36 సెకండరీ బోర్డులకు సంబంధించిన 51 మంది అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పరీక్షల ఒత్తిడిని తగ్గించడం, సంస్కరణలు తీసుకురావడంపై పలు సూచనలు చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన విద్యను అందించ డంలో విద్యాశాఖలు, ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు
0 Comments:
Post a Comment