రేపు దేశవ్యాప్తంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యంపై సర్వే - 3, 5, 8, 10 తరగతులవారికి పరీక్ష
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదు రవుతున్న 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాన్ని పరీక్షించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 12వ తేదీన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ ఏఎస్) నిర్వహించనుంది. మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 733 జిల్లాల్లో ఉన్న 123 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యా. ర్థుల ప్రతిభా పాటవాలను ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు. ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే సర్వే చివరి సారిగా 2017 నవంబర్ 13న జరిగింది. శుక్రవారం నిర్వహించబోయే సర్వేలో కొవిడ్ కారణంగా పిల్లల చదువులకు ఎదు ఆ రైన ఇబ్బందులు, కొత్తగా నేర్చుకున్న అంశాలను గుర్తించనున్నారు. 3, 5 తర గతుల విద్యార్థుల సామర్థ్యాన్ని భాష, గణితం, ఈవీఎస్ అభ్యాస విషయంలో లెక్కిస్తారు. 8వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో పరీక్షిస్తారు. 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని ఇంగ్లిష్, గణితం, సామాన్య సాంఘిక శాస్త్రాల్లో అంచనావేస్తారు. ఇందుకోసం తెలుగు, ఇంగ్లిష్, హిందీతోపాటు మొత్తం 22 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment