Money transfer with Aadhaar number
✍ఆధార్ నంబర్ తో మనీ ట్రాన్స్ఫర్
🌻న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వినియోగదారులు ఇకనుంచి తమ ఆధార్ కార్డు నంబర్తో డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. భీమ్ యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కొవిడ్-19 వెలుగు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. నిత్యావసరాల నుంచి ప్రధాన వ్యాపార కార్యకలాపాల పేమెంట్స్ ఆన్లైనులోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్ట్ ఫోన్ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లేనివారికి డబ్బు పంపించడం కష్టంగా ఉంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్)ని ఉపయోగించి ఫోన్, యూపీఐ అడ్రస్ లేనివారికి ఆధార్ నంబర్ ఉపయోగించి డబ్బు పంపవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఎఐ) తెలిపింది. కాగా భీమ్ అనేది యూపీఐ ఆధారిత యాప్. ఈ యాప్ ద్వారా మొబైల్ నంబర్, పేరుతో మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే ఇకనుంచి భీమ్ యాప్లో ఆధార్ నంబర్ను ఉపయోగించి నగదును పంపవచ్చు. భీమ్ యాప్ లో లబ్ధిదారుల చిరునామాలో ఆధార్ నంబర్ ఉపయోగించి డబ్బులును పంపే ఆప్షన్ ఉంటుంది. ఆధార్ నంబర్ను ఉపయోగించి 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి వెరిఫై బటన్ నన్ను క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ లింకింగ్, లబ్ధిదారుల చిరునామా ధ్రువీకరణ జరుగుతుంది. నగదును పంపిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ అవుతుంది.
0 Comments:
Post a Comment