జేవీకే కిట్లు పంపిణీ చేయలేదని తాఖీదులు
✳️అమరావతి: పాఠశాలల విద్యార్థులు కొందరికి జగనన్న విద్యా కానుక కిట్లు(జేవీకే) ఇంకా అందలేదు. ఇండెంట్‌కు మించి కిట్లు పంపినా వాటిని అర్హులైన వారందరికి ఎందుకు పంపిణీ చేయలేదని అందుకు బాధ్యులైన ప్రధానోపాధ్యాయులను వివరణ కోరాలని రాష్ట్ర సమగ్రశిక్ష అభియాన్ యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పథక సంచాలకులు జిల్లాల వారీగా జాబితాలు రూపొందించి 92 శాతం కన్నా పంపిణీ తక్కువ ఉన్న మండలాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు తాఖీదులు పంపి వారి వివరణ తీసుకోవాలని జిల్లా పథక సంచాలకులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పీవో వెంకటప్పయ్య స్పందించి అందుకు సంబంధించిన దస్త్రాన్ని రూపొందించి జిల్లా సంయుక్త పాలనాధికారి(జేసీ) రాజకుమారి ఆమోదానికి పంపారు. ఆమోదం రాగానే బాధ్యులైన హెచ్‌ఎంలకు తాఖీదులు పంపాలని జిల్లా సమగ్రశిక్ష అధికారులు యోచిస్తున్నారు. జిల్లాలో 9 మండలాల్లో 92 శాతం కన్నా తక్కువ పంపిణీ జరిగిందని గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఛైల్డు ఇన్‌ఫోలో డ్రాప్‌బాక్సులో ఉన్న పిల్లలందరిని కలిపి ఇండెంట్లు ప్రతిపాదించారు. మరికొన్ని పాఠశాలలు మూతబడ్డాయి. వాటి పేరుతోనూ కిట్లు పంపారు. అయితే క్షేత్రస్థాయిలో పంపిణీ చేద్దామనకున్నా పిల్లలు లేక ఆ కిట్లు మిగిలిపోయాయి.
0 Comments:
Post a Comment