ఇప్పుడు పంపే లైఫ్ సర్టిఫికెట్లు చెల్లవు
చిలకలూరిపేట , నవంబరు 24 :
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ లను అన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక ట్రెజరీ అధికారి బి.శ్రీనివాసరావు అన్నారు . పెన్ష నర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనలు ప్రకారం జనవరి , జనవరి , ఫిబ్రవరి నెలల్లో మాత్రమే పంపాలని ఆయన తెలిపారు . అయితే కొందరు పెన్షనర్లు ఇప్పుడే తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపు తున్నారని , అవి చెల్లవని అన్నారు . గత ఏడాది కూడా కొందరు పెన్షనర్లు గడువు కంటే ముందే లైఫ్ సర్టిఫికెట్లను పంప డంతో అవి చెల్లక వారు కొన్ని నెలలపాటు పెన్షన్ పొందలేకపోయారని ఆయన వివ రించారు .
0 Comments:
Post a Comment