Lakshmana phalam - లక్ష్మణ ఫలంతో అద్భుత ఆరోగ్య లాభాలు..తెలిస్తే తినకుండా ఉండలేరు!
లక్ష్మణ ఫలం.. ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో ఇది ఒకటి. లక్షణ ఫలం రుచిగా ఉండటమే కాదు.. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, థయామిన్, రైబోఫ్లోవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు సైతం నిండి ఉంటాయి.
అందుకే లక్షణ ఫలం గురించి తెలుసుకుంటే డైట్‌లో చేర్చుకోకుండా ఉండలేరని నిపుణులు అంటుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం లక్షణ ఫలం తినడం వల్ల లభించే ఆరోగ్య లాభాలు ఏంటో చూసేయండి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడే వారికి లక్షణ ఫలం ఓ మెడిసిన్‌లా పని చేస్తుంది. అవును, లక్షణ ఫలంతో జ్యూస్ తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గనుక అందులో పోషక విలువలు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లను పూర్తిగా నివారిస్తాయి. అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థం లక్షణ ఫలానికి ఉంది. అందుకే లక్షణ ఫలాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
నిద్ర లేమితో సతమతమవుతున్న వారు లక్షణ ఫలాన్ని తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. అదే సమయంలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలన్నీ దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది. లక్షణ ఫలాన్ని తింటే.. అందులోని ఐరన్, రైబోఫ్లోవిన్ వంటి పోషకాలు రక్త హీనతను నివారిస్తాయి. కాల్షియం ఎముకలను దృఢంగా మార్చి కీళ్ల నోప్పులను నివారిస్తుంది. అంతే కాదు, లక్షణ ఫలాన్ని డైట్‌లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట వంటి సమస్యలు దూరమై శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది. మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం పఠిష్టంగా మారుతుంది. కాబట్టి, ఇకపై లక్షణ ఫలం కనిపిస్తే అస్సలు వదిలి పెట్టకండి.
0 Comments:
Post a Comment