Inter Exams: ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు ..!
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ( Inter Exams ) వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించింది. మేలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపింది.
కానీ, ఇటీవలే ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయడానికి నెల రోజుల సమయం పట్టింది. ఈ నెల రోజులు తరగతులు అంతంత మాత్రంగానే జరిగాయి. ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో సిలబస్ పూర్తయ్యే అవకాశాలు లేవు. దాంతో వార్షిక పరీక్షలను ఒక నెల వెనక్కి జరుపాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుమతి తీసుకోవాలని యోచిస్తున్నారు.
0 Comments:
Post a Comment