Indian Navy Recruitment 2021: 10th పాస్ అయ్యారా..ఇండియన్ నేవీలో ఉద్యోగం మీకోసం..ఇలా అప్లై చేయండి..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ 2022-23 బ్యాచ్ కోసం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తిగల అభ్యర్థులందరూ ఇండియన్ నేవీ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ మోడ్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 5, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ 14 డిసెంబర్ 2021గా నిర్ణయించబడింది.
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ , పైప్ ఫిట్టర్ వంటి వివిధ ట్రేడ్‌లలో మొత్తం 275 ఖాళీలను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షలో గణితం, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి మొత్తం 50 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ రాత పరీక్ష 2022 జనవరి 27న నిర్వహించే అవకాశం ఉంది.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో 10వ తరగతి / SSC / మెట్రిక్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థి NCVT లేదా SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది కాకుండా, జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులు 1 ఏప్రిల్ 2001 నుండి 1 ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులందరూ నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో 5 డిసెంబర్ 2021లోపు http://www.apprenticeshipindia.org లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తరువాత, అభ్యర్థులు తమ దరఖాస్తును నిర్ణీత ఫార్మాట్‌లో , ఇతర అవసరమైన పత్రాలను నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు 14 డిసెంబర్ 2021 లోపు పంపవలసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
0 Comments:
Post a Comment