ప్రధానోపాధ్యాయుడే వంట మనిషి!
మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తూ..
మోమిన్‌పేట: పాఠశాల ప్రధానోపాధ్యాయుడే వంట మనిషిగా మారిపోయారు.
ఇది కేవలం ఏదో ఒక్క రోజుకు మాత్రం కాదు. దాదాపు రెండు నెలలకు పైగా ఇలాగే సాగుతోంది. వంటలు వండి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులుండగా 36 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే నిర్వాహకులకు ధర గిట్టుబాటు కావడం లేదు. అందుకని కొవిడ్ లాక్‌డౌన్ పూర్తయి పాఠశాలలు ప్రారంభమైనా వంట చేసేందుకు ముందుకు రాలేదు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకుంటే విద్యార్థుల హాజరు శాతం తగ్గుముఖం పడుతుందని మాణిక్యమే చివరకు రంగంలోకి దిగిపోయారు. ఒకవైపు విద్యార్థుల తరగతుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరగతులను నిర్వహిస్తూనే మధ్యాహ్నం వేళకు భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. అటు తరగతులు, ఇటు వంట పనులతో అవస్థలు తప్పడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంట మనిషిని ఏర్పాటు చేయాలని, అలాగే అదనంగా మరో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు.
0 Comments:
Post a Comment