Heart Attack: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నవయసులోనే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా గుప్పెడు గుండె కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ, ఆగే పరిస్థితులు తెచ్చుకుంటోంది.
తీవ్రంగా హార్ట్ ఎటాక్ వచ్చి సెకన్లలో గుండె ఆగిపోతే, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం ఉండదు కానీ, కొందరిలో మైల్డ్ గా, లేదా మధ్యస్థ స్థాయిలో హార్ట్ ఎటాక్ వస్తుంది. అలాంటప్పుడు కొన్ని పనులు చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
గోల్డెన్ అవర్ అంటే...
హార్ట్ ఎటాక్ వచ్చిన మొదట గంట సమయాన్ని 'గోల్డెన్ అవర్' అంటారు. ఆ సమయంలో రోగికి ఇచ్చే ప్రథమ చికిత్స అతడి ప్రాణాలను కాపాడుతుంది. ఆ గోల్డెన్ అవర్లో ఏం చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాళ్లకైనా, బయటి వాళ్లకైనా... ఎప్పుడైనా మన కళ్ల ముందే ఇలాంటి ఆరోగ్య స్థితి ఏర్పడినప్పుడు ఇలా చేస్తే వారికి పునరుజ్జీవితాన్ని ఇచ్చినవారమవుతాము.
ఏంచేయాలి?
హార్ట్ ఎటాక్ అని తెలియగానే ముందుగా అంబులెన్స్ కు సమాచారం అందించమని పక్కనున్న వాళ్లకి చెప్పండి. మీరే చేస్తే సమయం వేస్టువతుంది. మీరు రోగిని వెల్లకిలా నేలపై పడుకోబోట్టండి. అతని ఛాతీపై సీపీఆర్ చేయండి. సీపీఆర్ ఎలా చేయాలో చాలా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి అవి చూసి నేర్చుకోండి. రెండు చేతులతో ఛాతీకి మీద ఒత్తుతూ ఉండాలి. ఆగకుండా కనీసం 15 సార్లు ఒత్తాలి. అలా ఒత్తాక మధ్యలో నోట్లోకి గాలిని ఊదాలి. దీన్నే కృత్రిమ శ్వాస అందించడం అంటారు. ఇలా చేయడం వల్ల గుండె పూర్తిగా ఆగిపోకుండా తిరిగి కొట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. రోగి కూడా అపస్మారక స్థితికి చేరకుండా ఉంటారు. అంబులెన్స్ వచ్చే వరకు అలా చేస్తూ ఉండండి. దీని వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినవారవుతారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
0 Comments:
Post a Comment