విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు
బౌద్ధ స్తూపం వద్ద అధికారులు..
దొనకొండ, ముండ్లమూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నచోట అవసరమైనంత మంది ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ కమిషనర్ వి.చిన్నవీరభద్రుడు అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా పాఠశాలలకు పంపించాలని కోరారు. ముండ్లమూరు, దొనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆయన పరిశీలించారు. అనంతరం చందవరం బౌద్ధ స్తూపాలను సందర్శించారు. ఆయన వెంట సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వీ, ఎస్సీ ఈఆర్‌టీ ప్రతాప్‌రెడ్డి, మోడల్ స్కూల్ సెక్రటరీ రవీంధ్రనాథ్‌రెడ్డి, ఆర్‌జేడీ సుబ్బారావు, డీఈవో విజయభాస్కర్, ఎంఈవో సాంబశివరావు, రఘురామయ్య, ఎంపీపీ ఉషారాణి తదితరులు ఉన్నారు.
0 Comments:
Post a Comment