Duvvuri Subbamma was an Indian independence activist who played an important role in the Indian independence movement. She was one of the founders of the women's congress committee.
Born: 15 November 1881, East Godavari
Died: 31 May 1964
కడియం వాసి...
బ్రిటీషు బలగాలను వణికించిన దేశభాందవి
(నేడు దువ్వూరి సుబ్బమ్మ141వ జయంతి)
'ఉరిమింది భరతజాతి-రగిలింది ప్రజాశక్తి
మోగింది విజయభేరి-ఎగిరింది జాతీయ జెండా'
అని ఊరూరా పాడుతూ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిందామె.గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర
భహిష్కరణలో భాగంగా నేత వస్త్రాల మూటను నెత్తిన
పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్మేది. నలుగురు జనం
గుమిగూడితే చాలు స్వాతంత్య్ర ఉధ్యమం కోసం వాళ్ళల్లో
స్ఫూర్తి రగిలించేది. స్వాతంత్య్ర ఉధ్యమంలో జైలుకెళ్లిన తొలి ఆంద్ర మహిళగా గుర్తింపు పొందింది. గాంధీజీచే 'దేశబాంధవి' అని కీర్తించబడిన విధుశీమణి దువ్వూరి సుబ్బమ్మ.ఆమె1880 నవంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో పుట్టింది. వెంకటరమణమ్మ,మల్లాది సుబ్బావధాని ఆమె తల్లిదండ్రులు. నాటి సాంప్రధాయం ప్రకారం సుబ్బమ్మకి పదవ యేటే పెళ్లైంది. భర్త దువ్వూరి వెంకటసుబ్బయ్య,వారికి పిల్లలు లేరు. ఆయన అనతికాలంలోనే మరణించడంతో బాల్య వితంతువైంది సుబ్బమ్మ. భర్త మృతి ఆమెను కుంగదీసింది. ప్రజలే బిడ్డలుగా, దేశసేవే కర్తవ్యంగా తన భావి గమ్యాన్ని మార్చుకొందామె. అప్పటికి తనకి పెద్దగా అక్షరజ్ఞానం లేకపోవడంతో కడియం వెళ్లి మహాకవి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి దగ్గర శిష్యురాలుగా చేరింది. పట్టుదలతో సాహిత్యం నేర్చుకుని సంస్కృత,తెలుగు భాషల్లో పట్టు సాధించింది. తన పాండిత్యాన్ని,వక్తృత్వ శక్తిని ఉధ్యమానికి అర్పించింది. 1921లో కాకినాడలో జరిగిన రాజకీయ సభలో పాల్గొని 'సంపూర్ణ స్వాతంత్ర్య లక్ష్యం' తీర్మానాన్ని బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది సుబ్బమ్మ. ఆ సభకు టంగుటూరు ప్రకాశం అధ్యక్షులు. ఆమె ఉపన్యాసం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. నాటి నుండి ఆమె భారత స్వాతంత్ర ఉధ్యమంలో కీలక పాత్రైంది. తన మేనమామ చిలకమర్తి లక్ష్మీ నర్సింహం రాసిన'భరత ఖండంబు చక్కని పాడియావు'పద్యాన్ని రాగయుక్తంగా
పాడుతూ జనంలో స్వాతంత్ర్య జ్వాల రగిలించేది.
ఆమె కంఠం కంచులా మ్రోగేది. మైకుల్లేని ఆరోజుల్లో
ఆమె ఉపన్యాసం చాలా దూరం వినిపించేది. సుబ్బమ్మ
ఉపన్యాసమంటే ఆరోజుల్లో జనం వీధుల్లో గుమిగూడిపోయేవారు. సుబ్బమ్మ రాకను తెలుసుకొని
బ్రిటిష్ పోలీసులు ఆమె మాటలు ప్రజలకు చేరకుండా
డబ్బాలు వాయించేవారు. ఆగ్రహించిన సుబ్బమ్మ పోలీసులపై విరుచుకుపడేవారు."నేను గంగాభగీరథీ
సమానురాలును.నేను తలుచుకుంటే మిమ్మల్ని గంగలో
కలిపేయగలను.కానీ గాంధీజీ అజ్ఞానుసారం అహింసావ్రతాన్ని పునాను.నాదగ్గారా! మీ కుప్పిగంతులు
జాగ్రత్త!"అని హెచ్చరించేది. ఆ గర్జన వినగానే వారు నెమ్మదిగా జారుకునేవారు.సుబ్బమ్మ మాట తీరు కూడా ముక్కు సూటిగా,కరుగ్గా ఉండేది. ఓసారి కొందరు మహిళలు చేరి ఖద్దరు చీరలు బరువు మోయలేకపోతున్నామని సుబ్బమ్మకి మొరపెట్టుకున్నారు. "గుండెత్తులు బరువున్న మొగుళ్లను మోస్తున్నారు. ఉధ్యమం కోసం ఈ మాత్రం కొకలు బరువు
మోయలేరా?"ని సుబ్బమ్మ వాళ్ళను నిలదీసిందట.
సహాయనిరాకరణోద్యమం,ఉప్పుసత్యాగ్రహం,క్విట్ఇండియాఉధ్యమాల్లో గాంధీజీతో కలిసి పాల్గొని అనేకసార్లు జైలుకెళ్లింది. ఒకసారి స్వాతంత్ర్యం కోసం ర్యాలి జరుపుతున్న సుబ్బమ్మను పోలీసులు నిర్భంధించి, క్షమాపణ కోరితే విడిచి పెడతామన్నారు. "నా కాలి గోరు కూడా ఆపని చేయద"ని గంభీర స్వరంతో చెప్పిన ధీశాలి. భారతావని స్వేచ్చా సంకెళ్లకోసం ఎన్నోసార్లు ఆమె జైలుశిక్ష అనుభవించింది. జైల్లో కూడా ఆమె గట్టిగా పాటలు పాడుతూ అధికారులను హడలెత్తించేది. జైల్లో అధికారులను గధవాయించి తమకు కావాలిసినవి తెప్పించుకునేది. ఆనాడే మహిళా విద్య అవసరాన్ని గుర్తించి సుబ్బమ్మ విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పించింది. రాజమండ్రిలో బాలికల పాఠశాలను
స్థాపించింది. దీన్ని మహిళల్లో సామాజిక స్పృహ పెంచేందుకు జాతీయ సంస్థగా నడిపింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు "స్వేచ్ఛను పొందండి. ఆనందాన్ని అనుభవించండి, ఈ శుభవేళలో తీపి తినండి" అంటూ అందరికి మిఠాయిలు పంచిపెట్టింది. తన యావదాస్థినీ
దేశం కోసం అర్పించింది. స్వాతంత్ర్యానంతరం 16ఏళ్ళ పాటు ఏఐసిసి సభ్యురాలిగా ఉన్నారు. తన ఆస్థినంతా ఉద్యమానికి అర్పించిన సుబ్బమ్మ అవసాన దశలో కడియంలో రామచంద్రాచార్యులు ఇంటి గదిలో ఉండేది. 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో టంగుటూరి ప్రకాశం సుబ్బమ్మని పలకరించడానికి కడియం వచ్చారు.
అప్పటికి సుబ్బమ్మ గదిలో కూర్చోవడానికి కనీసం కుర్చీకూడా లేదు. ప్రకాశం రాక సమాచారంతో రామచంద్రాచార్యులు ఆయన కోసం అప్పటికప్పుడు చెక్కతో ఒక కుర్చీ చేయించారు. ఇప్పటికీ కడియంలో ఆకుర్చీ జరభద్రంగానే ఉంది. ఆమె ప్రకాశంతో మాట్లాడుతూ "ఒరేయ్!పంతులూ ఎలాఉందిరా?ఈ నల్లోళ్ల పరి పాలన"అని అడిగిందట. అహర్నిశలూ దేశం కోసమే పరితపించినామె 1964 మే31న తుదిశ్వాస విడిచింది.
నారీ శక్తికి స్ఫూర్తిగా నిలిచింది.
0 Comments:
Post a Comment