DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 116 పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే
అప్రెంటీస్ పోస్టులు కోరుకుంటున్నవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీఆర్‌డీఓకు చెందిన ప్రీమియం ల్యాబరేటరీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒడిషాలోని చండీపూర్‌లో ఉన్న ఈ ల్యాబరేటరీలో 116 అప్రెంటీస్ పోస్టులున్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 15 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల వివరాలు తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోండి.
DRDO Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు 116
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 50
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ 40
ట్రేడ్ అప్రెంటీస్ 26
DRDO Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 15 సాయంత్రం 5.30
విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి. ఇక ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.9,000, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.8,000. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
DRDO Apprentice Recruitment 2021: దరఖాస్తు విధానం
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు విధానం వేర్వేరుగా ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు బీఈ, బీటెక్, డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ http://www.mhrdnats.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అప్రెంటీస్‌షిప్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ తిరస్కరిస్తుంది. బీబీఈ, బీకామ్ పాస్ అయినవారికి ఈ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇతర అభ్యర్థులు ఈ పోర్టల్స్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ వెబ్‌సైట్‌లో ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
Step 1- అభ్యర్థులు సంబంధిత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత https://rac.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నోటిఫికేషన్ సెక్షన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి.
Step 3- పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- ఆ తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 5- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
0 Comments:
Post a Comment