Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో సోమవారం ఉదయం డాలర్ శేషాద్రి కన్నుమూశారని సమాచారం. కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు.
అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే డాలర్ శేషాద్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు.
డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారికి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఆయన రిటైర్ అయ్యారు. కానీ, ఆయన సేవలు తప్పనిసరి కావడంతో ఓఎస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆయనకు బాధ్యతలు అప్పగించింది. డాలర్ శేషాద్రి ఆకస్మిక మరణం పట్ల టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం టీటీడీకి తీరని లోటు అని పేర్కొన్నారు. జీవితంలో చివరి క్షణం వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు డాల్లర్ శేషాద్రి.
0 Comments:
Post a Comment