డీఈఓకు వినతులిస్తే చెత్త బుట్టలోకే..!
డీఈఓను దిగ్బంధించిన ఏబీవీపీ నాయకులు
అనంతపురం విద్య, నవంబరు 23: జిల్లా విద్యాశాఖాధికారికి ఏవైనా సమస్యలు పరిష్కరించాలని వినతులిస్తే...
వాటిని ర్యాక్‌లోనో.. చెత్త బుట్టల్లోనో పడేస్తారే తప్ప.. పరిష్కరించడం లేదని ఏబీవీపీ నాయకుల ధ్వజమెత్తారు. కదిరిలో పలు ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలను పరిష్కరించాలంటూ ఏబీవీపీ నా యకులు మంగళవారం డీఈఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు.
డీఈఓ శామ్యూల్ చాంబర్ ఎదుట నేలపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆయన సీ - సెక్షన్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి డీఈఓ డౌన్, డీఈఓ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కదిరిలో పలు ప్రైవేట్ స్కూళ్లలో 12 మంది ప్రభుత్వ టీచర్లు పనిచేస్తుంటే.... ఎందుకు చర్యలు తీసుకోలేదని, విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలతో చేతులు కలిపారంటూ ధ్వజమెత్తారు.
ఇక్కడ ఏదైనా జరిగితే...స్కూళ్లకు సమాచారం లీక్ చేస్తారంటూ మండిపడ్డారు. డీఈఓను కదలకుండా అడ్డంగా కూర్చొని ఆయన్ను నిలదీశారు. కదిరి ఎంఈఓను యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని, ఆయనకు విషయం తెలిసినా.... తొక్కి పెడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశా రు.
దీనికి ఆయన స్పందిస్తూ... కదిరిలోని స్కూళ్లపై ధర్మవరం డిప్యూటీ డీ ఈఓ మీనాక్షిని విచారణ చేయాలంటూ ఫోన్‌లో ఆదేశించారు. అదేవిధంగా ఎంఈఓను ఒకసారి వచ్చి తనను కలవాలని ఫోన్‌లో ఆదేశించారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
0 Comments:
Post a Comment