ఈరోజు జరిగిన DEO గారి సమావేశంలో చర్చించిన ముఖ్యమైన బోధన మరియు భోదనేతర అంశాలు:
బోధనేతర అంశాలు:
1.ఇక నుండి గుడ్లు మరియు చిక్కీలు కేవలం పాఠశాల లో అన్నం తినే పిల్లలు లెక్క కు అనుకూలం గా డీలర్ నుండి తీసుకోవాలి
2.ఎట్టి పరిస్థితుల్లో గుడ్లు చిక్కీలు ఇండ్ల కు పంప కూడదు
3.గుడ్లు డీలర్ నెలలో మూడు సార్లు సరఫరా చేయాలి అదీ పనిచేసే సమయం లో రావాలి
మనం 10 రోజులు కు సరిపడా మాత్రమే తీసుకోవాలి
4. చిక్కీలు నెల లో రెండుసార్లు సరఫరా చేయాలి మనం తినే విద్యార్థుల సంఖ్య ను బట్టి 15 రోజుల కు అనగా వారం లో మూడు పనిదినాలు చిక్కీలు ఇవ్వాలి కావున మొత్తం 6 పనిదినాలు కు మాత్రమే తీసుకోవాలి
5. 8 వ తేదీ నుండి విద్యార్థులు కు బయోమెట్రిక్ రాబోతుంది కావున ఉపాద్యాయులు కూడా బయోమెట్రిక్ తప్పనిసరి
6.Imms app పై అందరూ ఉపాద్యాయులు అవగాహన కలిగి ఉండాలి శానిటేషన్ మరియు mdm ఫొటోస్ upload చేయటం అందరి బాధ్యత
7.విద్యార్థులు కు పరిశుభ్రత పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంపొందించాలి
8. సచివాలయం సిబ్బంది తల్లిదండ్రులు కమిటీ సభ్యులు మరియు ఉపాద్యాయులు MDM పరిశీలించి టేస్ట్ పై సలహాలు ఇవ్వవచ్చును
9.బడిబయట పిల్లల ను గుర్తించి వారికి తగిన సూచన లతో తిరిగి బడిలో చేర్పించాలి
10.JVK distribution జరిగి ఇంకా data అప్లోడ్ చేయటం లో ఉన్న తేడా లను పూర్తి చేయాలి
బోధనాపరమైన అంశాలు
1. ఉపాద్యాయులు మరియు విద్యార్థులు అందరూ కాలం పట్ల గౌరవం ను కలిగి ఉండాలి
2.F A 1 నిర్వహించారు కావున వాల్యుయేషన్ పూర్తి చేసి marks ని upload చేయాలి
Note: కొంత మంది దిద్దకుండా marks వేసి పంపుతూ ఉన్నారు అలాంటివి దృష్టి కి వస్తే సంబంధిత ఉపాద్యాయులు మరియు ప్రధానోపాధ్యులు ఇరువురి ని suspend చేయటం జరుగుతుంది.
3.విద్యార్థులు 7 subjects అభ్యసిస్తున్న విషయం మీకు తెలుసు కావున వారికి కేటాయించే ఇంటిపని వారు చేయగలిగిన స్థాయి లో కేటాయించాలి
4.విద్యార్థులు బడి మాను కోవడానికి రెండు కారణాలు మొదటిది కుటుంబ సమస్యలు
రెండవది తరగతి గది లో అతని ని ప్రేరేపించే విధం గా లేకపోవడం
5.విద్యార్థులు యొక్క వ్రాత పని సబ్జెక్ట్ టీచర్స్ పరిశీలించి సంతకాలు చేయాలి
6.పునఃచరణ బోధన లేకపోతే Average students కూడా slow learners గా మారిపోతారు
7.విద్యార్థులు కు సంబంధించిన బోధనా పని లో మనవీయత ముడిపడి ఉండాలి
8.విద్యార్థులు వారు నేర్చుకున్నది వారికి అవసరమైనప్పుడు తిరిగి మౌఖిక మరియు వ్రాత పూర్వక వ్యక్తీకరణ చేయగలిగే విధంగా మనం ప్రేరేపించాలి
9.విద్యార్థులు మానసిక స్థాయి కి తగ్గ విధం గా వారి ని నిరంతరం అభ్యసన ప్రక్రియ ల లో నిమగ్నమయ్యే విధం గా పర్యవేక్షణ చేయాలి
వీటి లో ఒక్కటీ చెయ్యరు టీచర్స్.
ReplyDelete