ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : మండల పరిధిలోని పావులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆంద్ర óప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వాడరేవు చినవీర భద్రుడు బుధవారం సందర్శి ంచారు.
ఈ సందర్భంగా ఆయన పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యావిధానం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, విద్యార్థుల సంఖ్య, ఎఫ్‌ఎ పరీక్షల నిర్వహణ గురించి గురించి ప్రధానోపా ధ్యాయురాలు గిరిజను అడిగి తెలుసుకున్నారు. పావులూరు గ్రామానికి చెందిన గణిత వేధావి పావులూరి మల్లన్న విగ్రహం లేదా స్మారక స్తూపాన్ని నిర్మించాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు పావులూరి హైమావతి పావులూరి గణితం అనే పుస్తకాన్ని చినవీరభద్రుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ విద్యా సంచాలకులు వివి.సుబ్బారావు, జిల్లా విద్యా శాఖాధికారి విజయభాస్కర్, పర్చూరు ఉప విద్యాశాఖాధికారి ఎం. వెంకటేశ్వర్లు, యద్దనపూడి, వేటపాలెం మండలాల ఎంఇఒలు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment