కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు-2021 ప్రవేశపెట్టనుంది.
దీని ప్రకారం ఆర్‌బీఐ పరిధిలో అధికారిక సొంత డిజిటల్ కరెన్సీ రానుంది. భారత్‌లో మిగతా అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించనున్నారు! ఇందుకు సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్ బిల్లులో ఉంటుంది.
శీతకాలం సమావేశాల్లో మొత్తం 26 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగానే భారత్ క్రిప్టో కరెన్సీ నియంత్రణ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు, రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి కీలక బిల్లులు ఉన్నాయి.
వారం రోజుల క్రితమే క్రిప్టో కరెన్సీపై పార్లమెంటరీ ప్యానెల్ చర్చించింది. మొత్తంగా వర్చువల్ కరెన్సీని నియంత్రించాల్సిందేనని ఏకీగ్రీవంగా నిర్ణయించారు. నవంబర్ 16న కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్.. బ్లాక్‌చెయిన్, క్రిప్టో అసెట్స్ కౌన్సిల్, క్రిప్టో ఎక్స్‌ఛేంజీలు, పరిశ్రమ నిపుణులతో సమావేశమైంది. క్రిప్టో కరెన్సీని ఆపకూడదని అయితే కచ్చితంగా నియంత్రించాల్సిందేనని అంతా అభిప్రాయపడ్డారు. నియంత్రణ సంస్థగా దేనిని ఉంచాలో మాత్రం అప్పటికి నిర్ణయించలేదు.
మరి దేశంలో క్రిప్టోను పూర్తిగా నిషేధిస్తారా? అసెట్ క్లాస్‌గా పరిగణించి నియంత్రిస్తారా అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
0 Comments:
Post a Comment