Book Bridge River
నదిని దాటాలంటే ఈదాలి. కానీ ఈ నదిని దాటడానికి ఈదాల్సిన అవసరం లేదు. చిన్న జంప్ చేస్తే చాలు. ఎందుకంటే ఈ నది వెడల్పు అంత తక్కువగా ఉంటుంది.
ప్రపంచంలోనే అతి తక్కువ వెడల్పు ఉన్న నదిగా దీనికి గుర్తింపు ఉంది.ఈ నదిని దాటాలంటే జంప్ చేస్తే చాలు!
ప్రపంచంలో వెడలైన నది అంటే అమెజాన్ అని ఠక్కున చెప్పేస్తారు. వేసవిలో 6 మైళ్ల వెడల్పుతో పారే అమెజాన్, వర్షాకాలంలో 24 మైళ్ల వెడల్పుతో ప్రవహిస్తుంది. అయితే చైనాలోని హ్యులాయ్ అనే నది 15 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల 4 సెంమీల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇక పొడవు 17 కిలోమీటర్ల పైనే ఉంటుంది.
గాంగర్ గ్రాస్‌ల్యాండ్ గుండా ప్రవహిస్తున్న ఈ నదికి పదివేల ఏళ్ల చరిత్ర ఉంది. ఏడాది పొడవునా నదిలో నీళ్లు పారుతూనే ఉంటాయి. ఈ నదికి 'బుక్ బ్రిడ్జ్ రివర్' అని కూడా పేరుంది. పూర్వం ఒక బాలుడు నది వెడల్పుగా తక్కువగా ఉన్న ఒక చోట దాటే క్రమంలో చేతిలో ఉన్న బుక్ పడిపోయింది. ఆ పుస్తకం నది రెండు చివరలను కలుపుతూ వంతెనలా పడింది. చీమలు, కీటకాలు దాటడానికి ఆ పుస్తకం వంతెనగా ఉపయోగపడటంతో బుక్ బ్రిడ్జ్ రివర్ అని పేరు వచ్చిందని కథగా చెబుతారు.
0 Comments:
Post a Comment