📒✍️పనిభారంతో ఉపాధ్యాయుల ఆందోళన
అటకెక్కుతున్న పిల్లల చదువులు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
నేటిబాలలే రేపటి పౌరులు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. అలాంటి గురువులు అదనపు బాధ్యతలతో నలిగిపోతున్నారు. బోధన మాట ఏమోగాని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లతో కుస్తీ పడుతున్నారు. బయోమెట్రిక్ హాజరు, నాడు-నేడు ప్రోగ్రస్, మధ్నాహ్న భోజన పథకం, పారిశుధ్యం నిర్వహణపై ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్ చేయడం తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో సర్వర్ సమస్యలు, సిగ్నల్స్ ఇబ్బందులు వెరసి బోధనపై దృష్టి పెట్టలేని పరిస్థితులు బడుల్లో నెలకొన్నాయి. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు పాఠశాలలను సందర్శించినపుడు యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్ చేశారా!? లేదా!? అని మాత్రమే అడుగుతున్నారు తప్ప పిల్లల చదువుల గురించి పట్టించుకోవడం లేదు.
0 Comments:
Post a Comment