🟥యాప్‌మాటున...పాఠం మాయం
♦️వివరాల నమోదుతోనే సరి
♦️గురువుల బోధనకు సమయమేది..?
న్యూస్‌టుడే, అనంతపురం విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా, బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం బోధనేతర బాధ్యతలు అప్పగించడంతో బోధనకుంటుపడుతోంది. పాఠశాలల్లో సంక్షేమ పథకాల తీరుపై యాప్‌లో చిత్రాలు అప్‌లోడ్ చేయాలని తొలుత పేర్కొన్నారు. యాప్‌ల నిర్వహణ బాధ్యతలు రోజురోజుకూ పెరిగాయి. ఐఎంఎంఎస్, టీఎంఎఫ్, ఎంబీఎన్‌ఎన్, జేవీకే, ఏపీటెల్స్, దీక్షా తదితర యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కార్యక్రమానికి ఒక్కోయాప్. విద్యార్థుల హాజరుతో మొదలు కొని, మధ్యాహ్నభోజనం, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, జగనన్న విద్యాకానుక, ఆన్‌లైన్ శిక్షణ, వివిధ కోర్సుల వివరాలు యాప్‌లలో అప్‌లోడ్ చేయాలి. ఒక్కో అంశాన్ని చిత్రీకరించి అప్‌లోడ్ చేయడానికి గంటల సమయం పడుతుతోంది. బోధనేతర కార్యక్రమాలతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బోధనకు పూర్తిసమయం కేటాయించలేకపోతున్నారు. యాప్‌లో చిత్రాలు అప్‌లోడ్ చేయకపోతే ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో చదువునేర్పడం కంటే యాప్‌లపైనే దృష్టిసారిస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల హాజరు, మధ్యాహ్నభోజనం, మరుగుదొడ్లు ఫొటోలు తీసి వాటిని అప్‌లోడ్ చేస్తూ.. పాఠాలు చెప్పకుండా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
*ఇవీ సమస్యలు..*
పాఠశాల ఆరంభం కాగానే విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి హాజరుతో పాటు ఆ రోజు మధ్యాహ్న భోజనం పాఠశాలలోని ఆహారాన్నే భుజిస్తాడా..? లేదా? ఇంటి నుంచి తెచ్చుకున్నాడా? గుడ్డు, చిక్కీ తీసుకుంటాడా లేదా? అనేవి కూడా ఈ యాప్‌లో నమోదు చేయాలి. ఈ వివరాన్నీ నమోదు చేయడానికి మొదటి పీరియడ్ సరిపోతోంది. ఇక ఆ పిరియడ్ బోధన లేనట్టే.
టీఎమ్‌ఎఫ్ యాప్‌లో మూత్రశాలలు, మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. పాఠశాలల్లో ఎన్నిబ్లాకులుంటే అన్ని చిత్రాలు తీయాల్సిందే. పెద్ద పాఠశాలల్లో 20, 30 మరుగుదొడ్లు ఉంటే అన్ని పొటోలు తీయాల్సిందే. మరుగుదొడ్లలో తేమకనిపిస్తే ఫోటో అప్‌లోడ్ కాదు. ఇందులోనే సింక్, మరుగుదొడ్ల తలుపులు తదితర చిత్రాలు కూడా పంపాలి. రోజుకో ఉపాధ్యాయుడు ఈ పనిచేయాల్సి ఉంటుంది. ఆ రోజంతా వీటికే సరిపోతుంది.
ఐఎంఎంఎస్ యాప్‌లో మధ్యాహ్నభోజనం అమలు తీరును అప్‌లోడ్ చేయాలి. తొలుత వంట దినుసులు, ఉపయోగించే ఖాళీ పాత్రలు, మెనూ ప్రకారం వంటలు చేసిన చిత్రాలు, కోడిగుడ్లు, చిక్కీలు, భోజనం వడ్డన, విద్యార్థులు భుజించే ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. భోజన విరామ సమయంలో రోజుకో ఉపాధ్యాయునికి ఇదే పనితో సరిపెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి యాప్‌కే సమయం గడచిపోతోంది.
*సర్వర్‌తోనూ చిక్కులే..*
యాప్‌ల నిర్వహణ సమస్యగా మారింది. దూరప్రాంతాల్లోని పాఠశాలల్లో సర్వర్ సమస్య తలెత్తుతోంది. నెట్‌వర్కు లేకపోవడంతో అప్‌లోడ్ చేయలేని పరిస్థితి. మారుమూల ప్రాంతంలోని ఉపాధ్యాయులకు స్మార్ట్‌ఫోన్లు కూడా లేవు. స్మార్ట్‌ఫోన్లు ఉన్నా.. కొందరు ప్రధానోపాధ్యాయులు ఆపరేటిరగ్ చేయలేకపోతున్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడానికే గతంలో నానా తంటాలు పడ్డారు. యాప్‌లు మరింత భారంగా మారాయి.
*అప్పగించిన బాధ్యతలు చేయాల్సిందే*
*- శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి*
ప్రభుత్వం పాఠశాలల్లోని పథకాలు పక్కాగా అమలు చేయడానికి యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వీటిలో మొదట్లో సమస్యలుండేవి. యాప్‌ల నిర్వహణ సరళీకృతం చేశారు. 5 నిమిషాల్లో అప్‌లోడ్ పూర్తి చేయవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు నెట్‌వర్కు సమస్య కొన్ని చోట్ల మాత్రమే ఉంది. స్మార్ట్‌ఫోన్ల నిర్వహణ, యాప్‌లో అప్‌లోడ్ చేయడం కూడా ఉపాధ్యాయులందరూ నేర్చుకోవాల్సిందే.
*♦️భారం తగ్గించాలి*
*- నరసిరహులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి*
యాప్‌ల నిర్వహణతో బోధనకు ఆటంకం ఏర్పడుతోరది. మరుగుదొడ్లు శుభ్రరగా ఉండాలంటున్నారు. అవసరమైన సిబ్బందిని నియమించలేదు. ఆయాలను నియమించుకుంటే వారికి సక్రమంగా వేతనాలు అందడంలేదు. భోజన నిర్వహణలో కొందరు ప్రధానోపాధ్యాయులు సొంత ఖర్చులతో మెను అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. లోపాలుంటే ప్రధానోపాధ్యాయులకు చర్యలు ఉంటాయి. గుత్తేదారులు గుడ్లు, చిక్కీలు అందించకపోతే ప్రధానోపాధ్యాయులు బాధ్యులవుతున్నారు. యాప్‌ల భారం తగ్గించాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి.
జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు వడ్డిస్తుండగా ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని చిత్రీకరిస్తున్న దృశ్యమిది. భోజనం వండక ముందు సరకులు, ఖాళీ పాత్రలు.. వండిన తర్వాత మెనూ ప్రకారం చేసిన వంటల ఫొటోలు తీయాలి. గుడ్లు, చిక్కీలతో పాటు భోజనం వడ్డించే, విద్యార్థులు భోంచేస్తున్న చిత్రాలు యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. లేదంటే ప్రధానోపాధ్యాయులపై చర్యలు ఉంటాయి. ఇటీవల జిల్లాలో 1,138 మంది ప్రధానోపాధ్యాయులకు ప్రాంతీయ సంచాలకులు తాఖీదులు జారీ చేశారు.
సుధామణి.. ధర్మవరం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు సెలవుపై వెళ్లినపుడు.. ఈ యాప్‌లలో వివరాల నమోదు బాధ్యత ఆమెదే. విద్యార్థులకు పాఠ్యాంశాల పరంగా తగిన న్యాయం చేయలేక పోతున్నామనేది ఆమె అభిప్రాయం. యాప్‌లు తగ్గిస్తే విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంది. సర్వర్ పనిచేయని సమయంలో చాలా అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
*జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 3,841*
*విద్యార్థులు: 3.61 లక్షలు*
*ఉపాధ్యాయులు: సుమారు 18 వేలు*
*మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న పాఠశాలలు: 3496*
0 Comments:
Post a Comment