తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం కె స్టాలిన్ గారు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న తమ రాష్ట్రంలో ఇప్పటికే సంచలానాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోని నూటికి నూరు శాతం పాలన అందిస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడై, దేశంలో ప్రధమ స్థానం సాధించిన స్టాలిన్ ఈరోజు మరో సంచలానాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకొని అటు ఇరు కుటుంబాలకి, స్నేహితులకు, బంధువులకు దూరమై ఎటువంటి ఉద్యోగం లేక బ్రతుకుతున్న కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ఇకపై కులాంతర వివాహలు చేసుకున్న వారికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని, ద్రవిడ మున్నెట్ర కళగం డియంకె పార్టీ కులానికి వ్యతిరేకం అని ప్రకటించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికీ జీవనభృతి కల్పించడం కొరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
0 Comments:
Post a Comment