చెప్పకుండా పిల్లలను తరలిస్తే ఎలా?
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: మాటమాత్రమైనా చెప్పకుండా తమ పిల్లలను ఉన్నత పాఠశాలకు తరలిస్తే ఎలా అని మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత పాఠశాల ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా బీసీ కాలనీలోని విద్యార్థులను ఉపాధాయులు ఉన్నత పాఠశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉన్నత పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుందని, తమ పిల్లలు రోడ్డును దాటి ఎలా వస్తారని మండిపడ్డారు. ప్రస్తుత పాఠశాలల్లోనే తమ పిల్లలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Mpp స్కూల్స్ లో ప్రోగ్రెసివ్ కార్డ్స్ ఇవ్వటం లేదు. ప్రిన్సిపల్, అండ్ MEO నీ అడిగితే వారు చెప్పిన సమాధానం, GOVT PROGRISSIVE CARDS ఇవ్వటం లేదు. GOVT ఇస్తే
ReplyDeleteమేము ఇస్తాము. అని చెబుతున్నారు. శ్చ్