✍జేవీకే కిట్లు పంపిణీ చేయలేదని తాఖీదులు
🌻ఈనాడు-అమరావతి: పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు(జేవీకే) ఇంకా కొందరికి అందలేదు. ఇండెంట్‌కు మించి పంపినా వాటిని అర్హులైన వారందరికి ఎందుకు పంపిణీ చేయలేదంటూ ప్రధానోపాధ్యాయులను వివరణ కోరాలని రాష్ట్ర సమగ్రశిక్ష అభియాన్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పథక సంచాలకులు జిల్లాల వారీగా జాబితాలు రూపొందించి 92 శాతం కన్నా పంపిణీ తక్కువ ఉన్న మండలాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు తాఖీదులు పంపుతున్నారు. జిల్లా పీఓ వెంకటప్పయ్య స్పందించి అందుకు సంబంధించిన దస్త్రాన్ని రూపొందించి జిల్లా సంయుక్త పాలనాధికారి(జేసీ) రాజకుమారి ఆమోదానికి పంపారు. జిల్లాలో 9 మండలాల్లో 92 శాతం కన్నా తక్కువ పంపిణీ జరిగిందని గుర్తించారు. ఈఏడాది మార్చి, ఏప్రిల్‌లో బడిబయట ఉన్న పిల్లలపై క్లస్టర్ రిసోర్సు పర్సన్లు(సీఆర్‌పీ) సర్వే చేశారు. అందులో జిల్లా వ్యాప్తంగా 5692 మంది బడిఈడు పిల్లలు చదువు మధ్యలో ఆపేశారని గుర్తించారు. వారందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశాలు రావటంతో వారిని సీఆర్పీలు అదే పాఠశాలల్లో చేర్పించారని తెలుస్తోంది. వారెవరూ పాఠశాలల్లో భౌతికంగా లేరని, ఇంకొందరు అసలు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. గడిచిన మూడేళ్ల నుంచి ఛైల్డు ఇన్‌ఫోలో డ్రాప్‌బాక్సులో ఉన్న పిల్లలందరిని కలిపి ఇండెంట్లు ప్రతిపాదించారు. మరికొన్ని పాఠశాలలు మూతబడ్డాయి. వాటి పేరుతోనూ కిట్లు పంపారు. అయితే క్షేత్రస్థాయిలో పపిణీ చేద్దామనకున్నా పిల్లలు లేక ఆ కిట్లు మిగిలిపోయాయి. హాజరయ్యే ప్రతి విద్యార్థికి అందజేశాం. ఈ తప్పిదం తమదికాదని సీఆర్‌పీలే వారిని బడుల్లో చేర్చినట్లు పేపర్‌పై చూపారు తప్పిస్తే భౌతికంగా చాలా వరకు చేర్చలేదని, దానికి ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
0 Comments:
Post a Comment