మరో రూ.వెయ్యి కోట్ల రుణం
సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించిన ప్రభుత్వం
🌻ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా మరో రూ.వెయ్యి కోట్ల రుణం సమీకరించింది. మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వ హించిన వేలంలో 17 ఏళ్ల కాలపరిమితితో రూ.500 కోట్లు. 18 ఏళ్ల కాలప రిమితితో మరో రూ.500 కోట్లు తీసుకుంది. ఈ అప్పుపై ఏడు శాతం వడ్డీ చెల్లించనుంది. ఈ వేలంలో ఏపీతో పాటు అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా పాల్గొన్నాయి. అస్సాం మూడేళ్ల కాలపరిమితిపై 5.25 శాతం వడ్డీతో రూ.500 కోట్లు, పదేళ్ల కాలపరిమితిపై 6.4 శాతం వడ్డీతో రూ.500 కోట్ల రుణం పొందింది. రాజస్థాన్ పదేళ్ల కాలపరిమితితో రూ.6.92 శాతం వడ్డీతో రూ.500 కోట్లు, ఉత్తరప్రదేశ్ పదేళ్ల కాలపరిమితితో 6.33 శాతం వడ్డీకి రూ.2,500 కోట్లు తీసుకుంది. తమిళనాడు 7.01 శాతం వడ్డీకి రూ. వెయ్యి కోట్లు (బాండ్ల రీ ఇష్యూ) సమీకరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వానికి డిసెంబరు నెలాఖరు వరకు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.2.155 కోట్ల రుణం పొందే వెసులు. బాటు ఉండగా, అందులో రూ. వెయ్యి కోట్లు మంగళవారం తీసుకుంది..
0 Comments:
Post a Comment