ఎస్బీఐ వినియోగదారులకు షాక్..!
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకిచ్చింది. ఇక పై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టిన ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ రుసుము, దాంతో పాటు పన్నులూ వసూలు చేస్తామని ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ తెలిపింది.
ఈ మేరకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంస్థ శుక్రవారం ఒక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. 2021, డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ నిబంధన వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
0 Comments:
Post a Comment