సర్కారు సంస్థకు 'రెడ్ నోటీస్'
ప్రకటించిన భారత వైద్య పరికరాల పరిశ్రమల సంఘం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది.
నాలుగైదు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర రాష్ట్ర ఎంఎస్‌ఐడిసి (వైద్య సర్వీసుల మౌళికాభివృద్ధి సంస్థ)కు భారత వైద్య పరికరాల పరిశ్రమల సంఘం కాషన్ రెడ్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించింది. కొనుగోలు చేసిన పరికరాలకు బిల్లులు చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ నోటీస్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఏ పరిశ్రమ కూడా ముందస్తు నగదు చెల్లింపులు లేకుండా ఎంఎస్‌ఐడిసికి పరికరాలు అమ్మవద్దని సూచించింది.
అలా విక్రయిస్తే తరువాత ఆ బిల్లులకు ఆయా విక్రయ సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాము విక్రయించిన పరికరాలకు బిల్లులు చెల్లించడం లేదని పదేపదే ఆర్ధిక, ఆరోగ్యశాఖలకు లేఖలు రాస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని ఇప్పటికే యూనియన్ ఆరోపించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చేసిన కొనుగోళ్లతో పాటు, ఇటీవల కరోనా సమయంలో చేసిన ఆర్‌టి-పిసిఆర్ కిట్లు, ఎన్95 మాస్కులు, వైసర్ ట్రాన్స్‌పోర్ట్ కిట్లు, డ్రైనేజ్ బ్యాగ్‌లు, వెరటిలేటర్లు, అనస్థీషియా సర్క్యూట్లు వంటి కొనుగోళ్లకు కూడా బిల్లులు చెల్లింపు జరగలేదు. వీటికి సంబంధించి ఏడు సంస్థలకు 40 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాషన్ రెడ్ నోటీస్ జారీచేసినట్లు యూనియన్ వెల్లడించింది.
0 Comments:
Post a Comment