పత్రికా కథనం ఆధారంగా పేరెంట్స్ కమిటీ రద్దా!
ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
🌻ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీని సాక్షి పత్రిక కథనం ఆధారంగా రద్దు చేశారన్న ఆరోపణలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. పత్రిక కథనం ఆధారంగా రద్దు చేయడం ఏమిటని అదికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పిం చాలని విద్యాశాఖను ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. తల్లిదండ్రుల కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది సెప్టెం 27న అధికారులు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బ్రాహ్మణ కోడూరుకు చెందిన కొమ్మూరి సంధ్యారాణి హైకోర్టును ఆశ్రయించారు.
0 Comments:
Post a Comment