విడతల వారీగా అన్ని పాఠశాలలకూ సీబీఎస్ఈ గుర్తింపు : రాములు
🌻ఈనాడు, అమరావతి: ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విడతల వారీగా సీబీ ఎస్ఈ అనుబంధ గుర్తింపు పొందేందుకు ప్రభుత్వం, సీబీఎస్ స్ఈతో ఒప్పందం కుదుర్చుకుం దని ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రాములు తెలిపారు. మొదటి విడతలో సీబీఎస్ఈ బైలాస్ ప్రకారం అన్ని నిబంధనలను భర్తీ చేస్తూ 1,092 పాఠశాలలను విద్యాశాఖ ప్రతి పాదించిందని వెల్లడించారు. 2024-25 లో పదోత రగతి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాసేలా వీటిని ప్రతిపాదించినట్లు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో మిగతా పాఠశాలలు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు పొందుతాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, నిశీత పరిశీలన, ఉన్నత మైన అకడమిక్ ప్రమాణాలను సీబీఎస్ఈ పాటి స్తోందని, దీంతో విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధ గుర్తింపు పొందేందుకు సీబీఎస్ఈతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment